జగిత్యాల
జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కోడేటి రాజవ్వ వృద్ధురాలి భర్త మల్లయ్య 40 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఒక కొడుకు మృతి చెందగా మరో కుమారుడు గల్ఫ్ లో ఉంటున్నా డు. కోడళ్ళు అన్నం పెడతలేరని , తనని సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రూరల్ పోలీసులు రాజవ్వ కుటుంబ సభ్యులను స్టేషన్ కి వెంటనే రావాలని పిలిపించారు. వారితో పూర్తి విషయాలు మాట్లాడి ఆ వృద్ధురాలి బాగోగులు చూసుకోవాలని , వీటితో పాటు దవాఖాన ఖర్చుల నిమిత్తం డబ్బులు కూడా ఇవ్వాలని సూచించారు. ఇద్దరు కోడళ్లకు ఒక్కొక్కరు నెల రోజుల పాటు రాజవ్వ ను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న రాజవ్వ కు తోడుగా కూతురు లక్ష్మీ దేవి అ పోలీస్ స్టేషన్కు వచ్చింది..పోలీసుల కౌన్సెలింగ్ వల్ల ఓ వృద్ధురాలికి సత్వర న్యాయం జరిగింది.