YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ రణభేరి ప్రచార రధాలను ప్రారంభించిన విష్ణువర్ధన్ రెడ్డి

బీజేపీ రణభేరి ప్రచార రధాలను ప్రారంభించిన విష్ణువర్ధన్ రెడ్డి

కడప
ఈ నెల 19 న జరిగే రాయలసీమ రణ భేరి కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రధాలను  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణు వర్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ 33 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. -వైసీపీ చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 19 న కడప లో రాయలసీమ రణ భేరి కార్యక్రమం. దాదాపు 25 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు, ఉద్యోగుల కు, యువతకు ,రైతులకు తీరని మోసం ఈ ప్రభుత్వం చేసింది. కడప గడప నుంచి వైసిపి మోసాలను ఎండగట్టడానికి ఈ నెల 19 న రాయలసీమ రణ భేరి కార్యాక్రమం వుంటుందని అన్నారు. రాయలసీమ లో 52 అసెంబ్లీ స్థానాల్లో 49 మంది వైసిపి అభ్యర్థులను గెలిపించారు. 8 మంది ఎంపీ లు వైసీపీ నుంచి గెలిచారు. -మీరు గెలిచి రాయలసీమ లాభం ఏంటి . రాయలసీమ పురిటి గడ్డపై పుట్టిన జగన్ రాయలసీమ కు ద్రోహం చేశారు. -ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్ ఇదే చివరి అవకాశం కూడా అవుతుంది. 2024 లో బిజెపి జనసేన కలిసి అధికారంలోకి రావడానికి సీఎం సొంత జిల్లా నుంచి శంకరావాన్ని పూరిస్తున్నామని అన్నారు.

Related Posts