హైదరాబాద్
ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గోన్నారు. రాష్ట్ర మంత్రులు,సబితా ఇంద్రరెడ్డి,తలసాని,మహమూద్ అలి మరియు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు ఎమ్మెల్సీలతో కలిసి అయన పాల్గొన్నారు. బుధవారం రోజు ఉదయం ఎల్ బి నగర్ నియజకవర్గంలో పర్యటించిన మంత్రి కెటిఆర్ నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడా చెరువు దగ్గర 103 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పీ.పనులకు శంకుస్థాపన చేసారు. తరువాత ఏల్ బి నగర్ లో 9.28 కోట్లతో నిర్మించిన అండర్ పాస్, సాగర్ రింగ్ రోడ్ ఆలేఖ్య టవర్స్ దగ్గర 28.642 కోట్లతో నిర్మంచిన ఫ్లై ఓవర్ ప్రారంబించారు. మంత్రి కే టి ఆర్ మాట్లాడుతు ఎల్ బి నగర్ నియోజకవర్గం లో వరద ముంపు సమస్య కు చెక్ పెట్టేందుకు 103 కోట్ల రూపాయల నాలా అభివృద్ధి పనుల ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. వర్షాలు వరదలతో ఎల్ బీ నగర్ నియోజక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. గ్రేటర్ హైద్రాబాద్ లో వరద ముంపు సమస్య కు చెక్ పెట్టేందుకు దాదాపు 1000 కోట్ల తో నాలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు,ఎల్ బి నగర్ లో నాళాల కోసం 103 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం ఎస్సార్ డీపీ కింద ఎల్ బి నగర్ లో మొత్త0 672 కోట్ల రూపాయల తో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించామని,2500 కోట్ల రూపాయల తో ఎల్ బి నగర్ నియోజిక వర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలం లో సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ కడుతున్నాం. ఎల్ బి నగర్ లో ఉన్న భూ రిజిస్టేషన్ సమస్య ను పరిష్కరిస్తామని అన్నారు. కొత్త పించన్లు రెండు, మూడు నెలల్లో ఇస్తాం,భాజపా కార్పొరేటర్లు కూడా అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు రావాలి కోరారు,కిషన్ రెడ్డి కేంద్రం నుంచి 10 వేల కోట్లు తెచ్చి హైదరాబాద్ ను అభోవృద్ధి చేయాలని,భాజపా నేతలు మాతో పాటుగా అభివృద్ధి లో పోటీ పడాలని ఆయన అన్నారు. నాలాల పనులు వర్షాకాలం లోపు పూర్త చేయాలని మంత్రి అధికారులకి సూచించారు.