YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ స్వీకారం

పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ స్వీకారం

చండీఘడ్ మార్చ్ 16
పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌మాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్ పూర్వీకుల గ్రామం న‌వ‌న్‌ష‌హ‌ర్ జిల్లా ఖ‌ట్క‌ర్ క‌లాన్‌లో భ‌గ‌వంత్ మాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ మాన్‌చే ప్ర‌మాణ స్వీకారం చేయించారు.ఈ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హాజ‌ర‌య్యారు. పంజాబ్ ఎన్నిక‌ల్లో 117 స్ధానాల‌కు గాను ఆప్ 92 స్ధానాల్లో గెలుపొంద‌గా పాల‌క కాంగ్రెస్ కేవ‌లం 18 సీట్ల‌తో స‌రిపెట్టుకుని ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది.ధురీ అసెంబ్లీ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధి ద‌ల్వీర్ సింగ్ గోల్డీపై మాన్ 58,206 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఇక ఆప్ ప్ర‌భంజ‌నంతో సీఎం చ‌ర‌ణ్జిత్ సింగ్ చ‌న్నీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ స‌హా ప‌లువురు రాష్ట్ర మంత్రులు, దిగ్గ‌జ నేత‌లు ఓట‌మి చ‌విచూశారు.

Related Posts