YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేషన్ బియ్యం రీసైక్లింగ్పై కఠిన చర్యలు కరీంనగర్ డీఎస్ఓపై బదిలీ వేటు

రేషన్ బియ్యం రీసైక్లింగ్పై కఠిన చర్యలు  కరీంనగర్ డీఎస్ఓపై బదిలీ వేటు

రేషన్ బియ్యం రీసైక్లింగ్పై పౌరసరఫరాల శాఖ కమిషనర్  అకున్ సబర్వాల్ ఉక్కుపాదం మోపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టారు. ఆ శాఖకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాయి. ఈ నెల 11వ తేదీన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంపులోని వరుణ్ ఇండస్ట్రీస్ నుంచి నాలుగు లారీల్లో తరలిస్తున్న 540 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ధాన్యం కేటాయింపులు కూడా జరిపినట్లు తేలింది.  

ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కమీషనర్ ఇందుకు బాధ్యులైన అధికారులపై బదిలీ వేటు వేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టించి రీసైక్లింగ్కు పాల్పడితే క్రిమినల్ కేసులతో పాటు పీడీ కేసు నమోదుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అకాల వర్షాల నేపథ్యంలో కమిషనర్ మంగళవారంనాడు కరీంగనర్, వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లా అధికారులతో కరీంనగర్లో సమీక్షించారు. అలాగే మానకొండూరు, కేశవపట్నంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వరంగల్ రూరల్, అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి హన్మకొండలో, జనగాం, యాదాద్రిలో అధికారులతో సమీక్షించారు.  అంతకు ముందు కమిషనర్  స్వయంగా హుజూరాబాద్లోని రేషన్ బియ్యం పట్టుబడిన వరుణ్ రైస్ మిల్లును తనిఖీ చేసి ఆర్డివో, స్థానిక పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో  ప్రాథమిక విచారణ జరిపారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యులైన కరీంనగర్ డిసిఎస్వో ఎ. ఉషారాణిని బదిలీ చేస్తూ, హెడ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఎం.ఎ. నవాజ్,  ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్వరుల్లా ఖాన్ను రెవెన్యూశాఖకు సరెండర్ చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.  రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ హెచ్చరించారు.  పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయల సబ్సిడీతో కిలో రూపాయికే బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఆ బియ్యం అర్హులైన పేదలకు చేరకుండా కొంతమంది వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఇక నుండి ఒక్క బియ్యం గింజ దారీ మళ్లినా ఎవరిని ఉపేక్షించేది లేదని, ఎవరిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పేదలకు చెందవలసిన బియ్యం వారికి చేరవలసిందేనని అన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో కరీంగనర్, వరంగల్ జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, తరలింపును సమీక్షించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఏమాత్రం అధైర్యపడవద్దని అన్నారు. పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకు 3119 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.21 లక్షల మంది రైతుల నుండి 20.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, దీని విలువ రూ.3327.71 కోట్ల ఉంటుందని తెలిపారు. 20.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు.

Related Posts