YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం

మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం

హైద‌రాబాద్ మార్చ్ 16
తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు 6 నుంచి మే 23వ తేదీ వ‌ర‌కు, సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు 7 నుంచి 24 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

Related Posts