విశాఖపట్టణం, మార్చి 17,
గ్రేటర్ విశాఖ నగరం పరిధిలో కొత్త టౌన్ షిప్పులు రానున్నాయ్. ఆరువేల ఎకరాల్లో లే అవుట్ల అభివృద్ధి బాధ్యతను వీఎంఆర్డీఏకి అప్పగించింది ప్రభుత్వం. లక్షా 83వేల కుటుంబాలకు లబ్ధి చేకూరే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.జీవీఎంసీ పరిధిలో నివాస స్ధలాల కోసం ఎదురు చూస్తున్న పట్టణ పేదలకు ఊరట లభించింది.భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభివృద్ధి పనులకు యంత్రాంగం రెడీ అవుతోంది. పది మండలాల పరిధిలో ఇప్పటికే సేకరించిన 6వే116ఎకరాల్లో లే అవుట్లు ఏర్పాటు కానున్నాయి. ఈ బాధ్యతను విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చేపట్టనుంది. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా అర్బన్ ఏ రియాలో ఒక్కో కుటుంబానికి 72గజాల్లో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.రెండేళ్ళ క్రితం జీవో నెంబర్ 72 విడుదల చేయగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించేందుకు అవకాశం లేదన్న పిటిషన్లపై వాదనల తర్వాత కోర్టు వాటిని కొట్టి వేసింది. దీంతో లే అవుట్ల అభివృద్ధికి లైన్ క్లియర్ అయింది. లక్షా 83వేల మంది లబ్ధిదారులకు ఈ స్కీం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. త్వరలోనే ముఖ్య మంత్రి జగన్ వీటిని ప్రారంభిస్తారన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.అనకాపల్లి, భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌తో పాటు గాజువాక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు. హౌసింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా పేదలకు ఉపాధితో పాటు కొత్త ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇప్పటికే కొత్త కొత్త గ్రామాలు పుట్టుకుని వస్తుండగా…. నగరం పరిధిలో టౌన్ షిప్పులు అభివృద్ధి చెందుతాయని అధికార వర్గాలు లెక్కలేస్తున్నాయి.