నారాయణపేట
ఉట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామం శివారులోని వాగు నుంచి రాత్రివేళల్లో గత మూడు రోజులుగా మల్లేపల్లి,నాగిరెడ్డి పల్లి,కొల్లూరు, ఉట్కూర్ గ్రామాల పరిసరాల్లో ఇసుక మాఫియా గ్యాంగ్ రెచ్చిపోతుంది.. అడ్డు అదుపు లేకుండా 50 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తోంది.. అధికారుల అండతో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు.. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎవరు ప్రశ్నించిన ఎదురు తిరుగుతున్నారు.. ఇసుక వ్యాపారులి.. ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాలంటే నే భయపడిపోతున్న పరిస్థితి.. ఆగడాలు బెదిరింపులతో సొమ్ము చేసుకుంటున్నారు.. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల కు నంబర్ ప్లేట్లు తొలగించి ఇసుకను తరలిస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు వారిపై చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు..