YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బడ్జెట్‌ తర్వాత పంచాయతీ పోరు

బడ్జెట్‌ తర్వాత పంచాయతీ పోరు

- అనంతరం సాధారణ ఎన్నికలకు..
- ఫైనల్‌ దశకు పంచాయతీరాజ్‌ చట్టం :ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
- హాజరైన అడ్వకేట్‌ జనరల్‌
ప్రభుత్వం తయారు చేయబోయే నూతన పంచాయతీ రాజ్‌ చట్టం తుదిదశకు చేరుకు ంది. ఈ చట్టం ఆధారంగానే పంచాయ తీ ఎన్నికలకు వెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచ నగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి మొద టి లేదా రెండోవారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపి చట్టాన్ని ఆమోదింప చేసు కోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చ యంతో ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే బడ్జెట్‌ సమావేశాలు జరిపి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు కూడా రంగం చేసుకు న్నట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న పరిస్థితులను అంచనా బేరీజ్‌ వేసు కుని ఆ తర్వాత ఆరునెలల్లోనే సాధారణ ఎన్నికలకు వెళతారని సమాచారం. ఈ నేపథ్య ంలో పంచాయతీరాజ్‌ చట్టానికి ఎలాంటి న్యాయ పరమైన ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలతో చట్టాన్ని రూపొందించి, సీఎంకు అందించి ంది. దీనిని కేసీఆర్‌ ఫైనల్‌చేసి మంత్రివర్గం లో పెట్టాల్సి ఉంది. ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికి కేవలం చీఫ్‌ సెక్రటరీ నర్సింగరావు, వికాస్‌రాజ్‌, నీతూ ప్రసాద్‌, అదేవిధంగా అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. దాదాపు నాలుగైదు గంటలు చర్చించారు. న్యాయమైన పరమైన ఇబ్బందులపైనే చర్చించినట్టు తెలిసింది. చట్టంలో సర్పంచులకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించడంతో పాటు నిధులను పంచాయతీలకు ఇవ్వాలని పొందుపర్చబోతున్నట్టు తెలిసింది. అవినీతి చేసేవారిపట్ట సీరియస్‌గా ఉండేందుకు చట్టంలో అనేక అంశాలను చేర్చినట్టు తెలిసింది. నిధుల విడుదల, ఖర్చుపైనా పర్యవేక్షణ జరిపేందుకు ఉన్నతాధికారులతో కమిటీ వేస్తారని తెలుస్తోంది. 
అదేవిధంగా పరోక్ష ఎన్నికలా, ప్రత్యక్ష ఎన్నికలా అనేది చట్టంలో చేర్చనున్నారు. షెడ్యూల్‌, నోటిఫికేషన్‌, పోలింగ్‌ తదితర అంశాలతో పాటు ఎన్నికల ప్రక్రియను ఎన్నిరోజుల్లో ముగించాలన్నది కూడా చట్టంలో పేర్కొనబోతున్నారు. గతంలో ఉన్న విధానాన్ని మార్చారని తెలుస్తోంది. అడ్వకేట్‌ జనరల్‌ సూచనలతో న్యాయమైన ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా ఏర్పాటు చేయబోయే పంచాయతీల ప్రొసిజర్స్‌ కూడా చట్టంలోనే ప్రభుత్వం చేర్చబోతుంది. ఇప్పటివరకు 4000కిపైగా కొత్త పంచాయతీలను గుర్తించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. మిగతా పంచాయతీలను కూడా ఈ నెల 31లోగా అందించాలని జిల్లా కలెక్టర్లకు చెప్పాలని సీఎం ఆదేశించారు. 73,74 రాజ్యాంగానికి లోబడే నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు అధికారులు వివరించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 1,2 తేదీల్లో న్యాయశాఖ ఆమోదానికి చట్టాన్ని పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని అనుకున్నారు.
ఫిబ్రవరి 5లోపు బకాయిలు ఇవ్వాలి : కాంట్రాక్టర్లు అల్టిమేటం
ఫిబ్రవరి 5లోపు బకాయిలు చెల్లించాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌లోని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. బుధవారం హైటెక్స్‌లో బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశం జరిగింది. స్టీల్‌, ఐరన్‌..తదితర అంశాలపై చర్చించారు. రేట్లు భారీగా ఉండటం మాట్లాడుకున్నారు. బకాయిలు చెల్లించకుంటే డబుల్‌ బెడ్‌రూమ్‌, పంచాయితీరాజ్‌ రోడ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

Related Posts