YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ తో పింక్ అడుగులా...

కాంగ్రెస్ తో పింక్ అడుగులా...

హైదరాబాద్, మార్చి 17,
కాంగ్రెస్ పార్టీ రేపటి పరిస్థితి ఏమిటి? వరసగా ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోతూ వస్తున్న హస్తం పార్టీ భవితవ్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అయినా, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అయినా ఒక క్షణం తడబడతారేమో కానీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ ఒక్క సెకను కూడా ఆలోచించరు. కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటంలాగా, దూసుకొస్తుందని పీకే భవిష్యవాణి వినిపిస్తారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పీకే ఢంకా భజాయిస్తున్నారు.ప్రశాంత్ కిశోర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాకకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రశాంత్ కిశోర్’ తెలంగాణలో అధికార తెరాసతో రూ.500 కోట్లకో ఏమో బేరం కుదుర్చుకున్నారు. అయితే అదే ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయలేమని అంటున్నారు. మరో రెండేళ్లలో 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, ధీమాగా చెపుతున్నారు. ఇలా పీకే ప్రత్యర్ధులు ఇద్దరి పక్షాన వకాల్త పుచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ నేతలంతా ఒకే తాటిపైకి రావాలని పీకే పెద్ద కండిషన్ పట్టారు. అది ఎటూ జరగదు కాబట్టి ఇదీ జరగదనేది ఆయన కవి హృదయం అయితే కావచ్చును. అద‌లా ఉంటే, తెలంగాణలో పీకే వ్యూహం ఏంటి? కాంగ్రెస్, తెరాసలను కలిపేందుకు పీకే పౌరోహిత్యం చేస్తున్నారా? తెరాసను గెలిపించాలంటే, కాంగ్రెస్ సపోర్ట్ మస్ట్’ అనే నిర్ణయానికి వచ్చారా? అందుకే ఆయన గతానికి భిన్నంగా కాంగ్రెస్ భవిష్యత్ విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, ఢిల్లీ యాత్ర, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత  కేసీఆర్ స్వరంలో కూడా మార్పు వచ్చిందని పరిశీలకులు అంటునారు. ఢిల్లీ యాత్రలో భాగంగా, జార్ఖండ్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జూనియర్ సోరెన్’తో కలిసి అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్’లో కేసీఆర్’ మూడో కూటమి అలోచనే లేదన్నారు. అంతకు ముందే, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పట్ల కాసింత ప్రేమను ఒలక పోసిన కేసీఆర్, తాజాగా, అసెంబ్లీలో ఎన్డీఎ పాలన కంటే గతంలో దేశాన్ని  పదేళ్ళు పాలించిన, యూపీఏ  పాలనే మెరుగ్గా ఉందని, కాంగ్రెస్ పార్టీకి కితాబు నిచ్చారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్, బీజేపీలను ఒకే గాటన కట్టేసిన్ కేసీఆర్, ఇప్పడు ఆ రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నారని పరిశీలకు అంటున్నారు. అలాగే మంత్రి కేసీఆర్ ‘కూడా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కను పొగడ్తలతో ముంచెత్తారు. మంచోడు అంటూ కితాబు నిచ్చారు. అంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందే, తెరాస, కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఎలో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్, తెరాస పార్టీల్లోని మెజారిటీ సభ్యులు అదే కోరుకుంటున్నారు. మరో వంక పంజాబ్’లో సిద్దూ ప్రయోగం విఫలమైన నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా, తెరాసతో పొత్తుకు సుముఖంగానే ఉందని అంటున్నారు. అయితే నిజంగా అలాంటిది జరిగితే, రేవంత్ రెడ్డి, ఆయన వర్గం ఏమి చేస్తారు? ఇది ఇప్పుడు కొత్తగా చర్చకు వస్తున్న విషయం.

Related Posts