హైదరాబాద్, మార్చి 17,
ఎమ్మెల్యే సీతక్క. తెలుసుగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్. మాజీ నక్సల్. అడవి బిడ్డ. అలాంటిది.. ఆ అడవి బిడ్డలైన, వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలపై చిన్నజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? అందుకే, చినజీయర్‌పై భగ్గుమని ఫైర్ అయ్యారు సీతయ్య. తెలంగాణ గిరిజన జాతరపై ఇష్టం వచ్చినట్టు.. సమ్మక్క-సారలమ్మలపై అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. సమ్మక్క-సారలమ్మను చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు కూడా దర్శించుకోవడం ఏంటంటూ చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ ఎమ్మెల్యే సీతక్క ఏమన్నారో ఆమె మాటల్లోనే.....మా తల్లులది వ్యాపారమా?.. మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా?.. మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు, కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతామూర్తి విగ్రహం చూడ్డానికి రూ.150 టికెట్ ధర పెట్టారు. ఎవరిది వ్యాపారం?.. మీది బిజినెస్, సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఎవరైనా పేద వారి ఇంటికి వెళ్ళారా?" అని చినజీయర్ స్వామిని నిలదీశారు సీతక్క. చిన్నజీయర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన్న జీయర్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. మరి, సీతక్క వ్యాఖ్యలపై చినజీయర్ స్పందిస్తారా? స్పందిస్తే ఏమని బదులిస్తారు? తనపై చేసిన ఆరోపణలు నిజమేనా? స్వామి రియల్ ఎస్టేట్ స్వామినా? ఇంటికి రావాలంటే డబ్బులు తీసుకుంటారా? కేవలం సంపన్నులను మాత్రమే కలుస్తారా? రఇయల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఇలా సీతక్క సంధించిన ప్రశ్నలకు జవాబు ఏది?