YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం విదేశీయం

అంతరిక్షంలో పాలమూరు వాసి

అంతరిక్షంలో పాలమూరు వాసి

మహబూబ్ నగర్, మార్చి 17,
రాజాచారి. అచ్చ తెలుగు పేరు ఉన్నా.. అచ్చం తెలుగువాడు మాత్రం కాదు. తండ్రి అమెరికాలో స్థిర‌ప‌డిన‌ తెలుగువాడు, త‌ల్లి అమెరిక‌న్‌. రాజాచారి సైతం యూఎస్‌లోనే పుట్టి పెరిగి.. ఇప్పుడు అంత‌రిక్ష యానం చేసిన తెలుగువాడిగా చ‌రిత్ర సృష్టించాడు. స్పేస్ వాక్‌ చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్‌ఎస్‌ నుంచి బయటకొచ్చి.. ఆరున్నర గంటలకు పైగా స్పేస్‌వాక్‌ చేసి.. కీలక ప్రయోగాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు రాజాచారి. స్పేస్‌ స్టేషన్‌ స్టార్‌ బోర్డు-4 ట్రస్‌లో సోలార్‌ ప్యానళ్లను మార్చి.. మ‌రో వ్యోమ‌గామితో క‌లిసి ఆరు ‘ఐఎస్‌ఎస్‌ రోల్‌ ఔట్‌ సోలార్‌ ఆరే’లను అమ‌ర్చారు. స్పేస్‌ స్టేషన్‌లో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు నాసా ఈ మార్పు చేసింది. రాజాచారికి ఇదే తొలి స్పేస్‌ వాక్‌. రాజాచారి ముందుత‌రం వారు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. రాజాచారి తాత ఉస్మానియా యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసాచారి ఉస్మానియాలో బీటెక్ చేసి.. 1970ల్లో అమెరికా వెళ్లారు. పెగ్గీ ఎగ్బర్ట్‌ అనే అమెరిక‌న్‌ను పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయ్యారు. 1977 రాజాచారి పుట్టారు. అక్క‌డే ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల్లో చ‌దువుకున్నారు. ఆ త‌ర్వాత అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ఎఫ్‌-35, ఎఫ్‌-15, ఎఫ్‌-16, ఎఫ్‌-18 ఫైట‌ర్ జెట్స్ న‌డ‌ప‌డంలో రాజాచారి ఎక్స్‌ప‌ర్ట్‌. ఆ త‌ర్వాత అంత‌రిక్ష‌యానంపై ఉన్న ఇంట్రెస్ట్‌తో 2017లో ‘నాసా ఆస్ట్రొనాట్‌ గ్రూప్‌ 22’ మిషన్‌కు అప్లై చేసి.. సెలెక్ట్ అయ్యారు. రెండేళ్ల శిక్ష‌ణ త‌ర్వాత‌.. ‘నాసా కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో జాయింట్‌ టెస్ట్‌ టీమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. లాస్ట్ ఇయ‌ర్ రాజాచారిని నాసా ‘ఆర్టెమిస్‌’ టీమ్‌కి ఎంపిక చేసింది. 18 మంది బృందంలో ఇద్దరిని ఎంపిక చేసి 2024లో చంద్రుడిపైకి పంప‌నుంది నాసా. ఆర్టెమిస్‌ టీమ్‌లోని ఒకరికి కుజుడిపైకి వెళ్లే ఛాన్స్ ద‌క్క‌నుంది. చంద్రుడు-కుజుడు రెండింట్లో ఏ ఒక్క మిష‌న్‌కు రాజాచారి సెలెక్ట్ అయినా.. అది తెలుగుజాతికి మ‌రింత గ‌ర్వ‌కార‌ణం.

Related Posts