ఏలూరు
కల్తీ సారా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారన్న నేపథ్యంతో ఐసీయూలో ఉన్న బాధితులను జనరల్ వార్డ్ లో షిఫ్ట్ చేయకుండా ఆసుపత్రి అధికారులు వారిని డిశ్చార్జ్ చేసారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ ( చంటి ) మాట్లాడుతూ ట్రీట్మెంట్ పూర్తి కాకుండా బాధితులను డిశ్చార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కల్తీ సారా వలన ఎంతమంది బాధితులు చనిపోయారు ఆరోగ్య శాఖ మంత్రి నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల నుండి అమ్మే మద్యం లో కూడా కల్తీ జరుగుతుంది. మద్యం వలన కూడా ఏదైనా జరిగితే ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. ప్రభుత్వం అమ్మే మద్యాన్ని కూడా టెస్టింగ్ చేసి నివేదిక ఇవ్వాలని అన్నారు.