కరీంనగర్
కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ పుట్టిండు నేను పుట్టినందుకు సంతోషంగా ఉంది. రామన్న కూడా సీఎస్ హాస్పిటల్ లోనే పుట్టిండు కరీంనగర్ నగరం కేటీఆర్ జన్మస్థలం కావడం వల్లే రామన్నకు ఎనలేని ప్రేమ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ వేంకటేశ్వర టెంపుల్ ఇచ్చినందుకు కేసీఆర్ కు రుణపడి ఉంటాం. అద్భుతమైన మానేరు రివర్ ఫ్రాంట్ కు రామన్న శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. సంవత్సరంలో మానేరు రివర్ ఫ్రాంట్ 400 కోట్లతో నిర్మాణం పూర్తి అవుతది. నగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్ కేటీఆర్ కు రుణపడి ఉంటా. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని అన్నారు.
కరీంనగర్ లో తెలంగాణ వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ అప్పుడేలా ఉంది ఇప్పుడెలా ఉందో చూస్తే తెలుస్తోంది. బావి తరానికి కరీంనగర్ ను గొప్పగా చెప్పుకునేలా తయారు అవుతుంది. కేటీఆర్ హయాంలో సాఫ్ట్ వేర్ కంపిని లు ఉరుకులు పెట్టుకుని వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కట్టుదిట్టముగా ఉండి శాంతి భద్రతలుతో ఉన్నాం. రాష్ట్రంలో కరెంట్ నీళ్లు అన్ని సమృద్ధిగా ఉన్నాయని అన్నారు.