కరీంనగర్
కరీంనగర్ కి బీజేపీ ఎంపీ గా, రాష్ట్ర అధ్యక్షునిగా ... 3 ఏళ్లలో తెచ్చిన పనుల వివరాలు చెప్పాలి. దమ్ముంటే గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్. బండి సంజయ్ ..దమ్ముంటే కరీంనగర్ మంత్రి గంగుల పై పోటీ చేసి గెలువు. ఈసారి కమలాకర్ ని లక్ష మెజారిటీ తో గెలిపిస్తాం. కరీంనగర్ నుండి సంజయ్ గెలిచి మూడేళ్లు అయింది ..కనీసం మూడు కోట్ల పని అయినా చేసావా అని ప్రశ్నించారు.
సిరిసిల్ల ,చొప్పదండి నియోజకవర్గాలకు ఏమైనా చేసావా అంటే అదీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం కనీసం పార్లమెంట్ లో నోరు విప్పలేదు ఎంపీ బండి సంజయ్. హిందూ హిందూ అంటావు కనీసం ఒక టీటీడీ నుండి గుడి తీసుకొచ్చావా .. అదీ కూడా మేమె తెచ్చామని అన్నారు.
హిందూ ముస్లిం అంటూ విషం చిమ్మడం తప్ప ఏమి చేయలేదు. డబల్ ఇంజన్ కోరుకుంటున్నారు అన్నావ్. కరీంనగర్ లో ఎంపీగా నువ్వు .,ప్రధానిగా మోడీ డబల్ ఇంజన్ లు ఉన్నారుగా ..మరి ఏమి తెచ్చావ్ కరీంనగర్ కి అని ప్రశ్నించారు. మతం అనే పిచ్చి కడుపు నింపదు ...అభివృద్ధి కోసం పోరాడండి. యూపీ ,బీహార్ లో జరిగే అభివృద్ధి పనుల్లోనూ తెలంగాణ పన్ను డబ్బులు ఉన్నాయని అన్నారు.