YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వన్ టైం డిస్కౌంట్ ద్వారా 130 కోట్లు

వన్ టైం డిస్కౌంట్ ద్వారా 130 కోట్లు

హైదరాబాద్, మార్చి 17,
తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్‌ ఆఫర్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఇక, దీనికి సంబంధించిన తాజా డేటాను విడుదల చేశారు ట్రాఫిక్‌ పోలీసులు.. ఈ నెల 1వ తేదీ నుంచి ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌ ప్రారంభం కాగా.. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్ని చలాన్లు క్లియర్‌ అయ్యాయి.. వాహనదారులు ఎంత మొత్తాన్ని చెల్లించారనే గణాంకాలు వెల్లడించారు.తెలంగాణ వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్‌ అయ్యినట్టు వెల్లడించారు ట్రాఫిక్‌ పోలీసులు.. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ. 130 కోట్లు ఫైనల్‌లు చెల్లించారు వాహనదారులు.. ఇది సాధారణ ఛార్జ్‌లతో చూస్తే మాత్రం రూ. 600 కోట్లుగా ఉంది.. ఇక, పేరుకుపోయిన ట్రాఫిక్‌ చలాన్లు కట్టినవారిలో 80 శాతానికి పైగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వాహనదారులే ఉన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు ఆ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది.. మార్చి 1వ తేదీ.. ఆ తర్వాతే కాదు.. ఇప్పటికే నిమిషానికి వెయ్యికి పైగా చలాన్ల చొప్పున వాహనదారులు చలాన్లు క్లియర్‌ చేసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అయితే, మొదటి రోజే 5 .5 కోట్ల రూపాయలు ఫైన్‌లు చెల్లించారు.. డిసెంబర్ 2021 వరకు 80లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయని తేల్చిన పోలీసులు.. పెండింగ్ చలాన్ క్లియరెన్స్ కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు.. వన్ టైమ్ డిస్కౌంట్ పేరుతో పెట్టిన చలాన్ల క్లియరెన్స్‌కు ప్రజల నుండి భారీ స్పందన వస్తోంది.

Related Posts