YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కెసిఆర్ కి భయం పట్టుకుంది.

కెసిఆర్ కి భయం పట్టుకుంది.

ఇందిరా పార్క్
ఎమ్మెల్యేలను అసెంబ్లీలో లేకుండా సస్పెండ్ చేసినందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలనీ మూర్ఖపు ఆలోచన లేవనెత్తినందుకు నిరసనగా ఒక్కరోజు దీక్ష చేపట్టామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కార్యక్రమంలో అయన కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈటల మాట్లాడుతూ హుజురాబాద్ లో నన్ను ఓడించడానికి అనేక కుట్రలు చేశారు.. నా ముఖం అసెంబ్లీ లో కనపడకుండా చేయాలనీ ఎన్నో కుతంత్రాలు చేశారు.  అయినా తెలంగాణ సమాజం హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకున్నారు. కెసిఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికని భావించి యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఎదురుచూస్తున్నారు వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దు అని హుజూరాబాద్ ప్రజలు బీజేపీ నీ గెలిపించారు.  యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ వారు అందరూ సంబురాలు చేసుకున్న సందర్భం హుజూరాబాద్ ఎన్నిక. సీఎం నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి గౌరవం నిలుపుకొని ఉండాల్సింది. అది చేయకుండ నన్నే శాసన సభలో లేకుండా చేశారు. పిరసన చెప్పే హక్కు లేకుండా.. పోలీస్ పెట్టీ మరీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పడేశారు.  నీచపు ప్రభుత్వం ఇది, నీచపు సీఎం కెసిఆర్. ప్రజాస్వామ్య విలువలు అపహస్యం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత ఈ సీఎం కి ఎం పుట్టింది.. 2 గంటల ప్రెస్ మీట్ ఏంటి, ఈయననేన మన సీఎం అని తలదిచుకున్న పరిస్థితినీ కెసిఆర్ తెచ్చారు.  బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా.. ఆర్టికల్ 3 ప్రకారం సింపుల్ మెజారిటీ తో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.  కెసిఆర్ జేజెమ్మ దిగి వచ్చినా అంబేద్కర్ ఇచ్చిన ఆ రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు.
మిస్టర్ సీఎం నీకు నైతికత లేదు,  మానవసంబందాలు లేవు.  నాలుగు కోట్ల ప్రజలు ఓట్లు వేస్తేనే 2014లో సీఎం గా కూర్చున్నావు. ఆ హక్కు కల్పించింది భారత రాజ్యాంగం.  కానీ ఆ సీటులో కూర్చున్న సీఎం  రాజ్యాంగానికి రాష్ట్రంలో పెద్ద అయిన గవర్నర్..  వ్యవస్థనే అవమానించారు కెసిఆర్.  గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారు.  గవర్నర్ ప్రసంగం రాష్ట్ర విధాన పత్రం.  ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఒక్క గవర్నర్ నే కాదు.. శాసన సభను అవమానపరిచారు. ఆ ఘనత కూడా కెసిఆర్ సంపాదించుకున్నారు.  చట్టాలు చేయాలని మాకు ఓటు వేసి మమ్ముల్ని ఎమ్మెల్యేగా పంపించారు.  డ్జెట్ సమావేశాలు 7 రోజులు మాత్రమే జరపడం నీచం, అన్యాయం.  మా హక్కులు హరించారని ఆరోపించారు. సభ మర్యాదను హరిస్తున్నరు అని మా సీట్లలో మేము నిలుచొని నిరసన చెప్తే మమ్ముల్ని సస్పెండ్ చేశారు. సీఎం చెప్పినట్టు స్పీకర్ చేస్తే మేము కోర్టు మెట్లు ఎక్కినం.కోర్ట్ స్పీకర్ నిర్ణయం తప్పు పట్టి, సరి చేసే భాధ్యత మీదే అని స్పీకర్ నీ కోర్ట్ కోరితే..ఆ కోర్ట్ ఆదేశాలు కూడా పట్టించుకోకుండా మమ్ముల్ని బయటికి పంపించారు.  చివరికి మేము ఈ మీటింగ్ కి పెర్మిషన్ అడిగితే ఇవ్వకుండా ఇక్కడ ips అధికారి.. చట్టానికి అనుగుణంగా కాకుండా సీఎంకి అనుగుణంగా పని చేస్తున్నారు.  చరిత్రలో నియంతల పట్టిన గతే మీకు పడుతుంది.  కూసిఆర్ కి కూడా అదే గుణపాఠం తప్పదు.  తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులు ఇప్పుడు బయట ఉన్నారు. ఆనాడు కెసిఆర్ గారికి సాహసవంతులు కావల్సివచింది. కానీ ఇపుడు వారు అవసరం లేదు.  కెసిఆర్ ప్రభుత్వంలో కి వచ్చిన తరువాత మొదట బయటికి పంపించింది 1700 మంది మున్సిపల్ కార్మికులను. కెసిఆర్ ఇలాకాలో సమ్మెలు సంఘాలు ఉండవడ్డు అని బయటికి పంపారు.  1700 మంది బిక్కుబిక్కమంటే 2015 లో  ఆర్థిక మంత్రిగా ఉండి కూడా నేను వారివద్దకు వెళ్లిన. మీ పక్షాన ఉంటా అని భరోసా ఇచ్చి వచ్చిన. వారికి ఉద్యోగాలు తిరిగి ఇప్పించినమని అన్నారు. ఆర్టీసీ బంద్ కాకుండా ఉద్యమం సంపూర్ణం కాదు అని 40 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు.  కానీ తెలంగాణ వచ్చిన తరువాత ఆర్టీసీ సంఘం రద్దు చేయండి అని కెసిఆర్ హుకుమ్ జారీ చేస్తే సంఘం కూడా రద్దు చేసుకున్నారు పాపం. ఆ ఆర్టీసీ మీటింగ్ కి పోయి సంఘాలు ఉంటాయి. అది కార్మికుల హక్కు అని మంత్రి గా ఉండి గళం ఎత్తిన వాడిని నేను.  ఆర్టీసీ వారికి చాలా సంబంధాలున్నాయి అని భయపడి కెసిఆర్ మళ్లీ వారిని తీసుకున్నారు.  ఇందిరా పార్క్ చైతన్యపు అడ్డా, అణగారిన వర్గాల బావుటా.  ఈ ధర్నా చౌక్ నీ ఎత్తివేసిన కెసిఆర్. తిరిగి తానే స్వయంగా 16 మంది మంత్రులతో ధర్నా చేసే స్థితి కి వచ్చిన వాడు కెసిఆర్.  కెసిఆర్ కి, హరీష్ రావు కి ఛాలెంజ్ చేస్తున్న మీ బడ్జెట్ మీద చర్చ చేద్దామా?  మొత్తం అబద్ధాలు చెప్పారు.  హరీష్ నేను పూర్తి అవగాహన తో మాట్లాడినా.
25,500 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ రికమండ్ చేసింది అని బడ్జెట్ లో పెట్టడం నీచం. అది ఎప్పుడో తిరస్కరించబడింది.  నేను చెప్పింది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా.  కెసిఆర్ కి బడ్జెట్ అంటే దొంగ లెక్కలు, దొంగ అకెలు.  కేంద్రం బడ్జెట్ ఒక్క రూపాయి కూడా అటుఇటు కాదు.   భూముల అమ్మకం పై 15 వేల కోట్లు వస్తాయి అని పెట్టారు. తెలంగాణ వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు 4 వేల కోట్ల కంటే ఎక్కువ రావని అన్నారు.
అన్ని కోట్లు వస్తాయి అని పెట్టడం పెద్ద తప్పు.  గొల్ల లెక్క చెప్పుకున్నా..  గత బడ్జెట్ లో 1.92 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని రాస్తే.. 1.22 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది.  Frbm పరిమితి పెంచడం వల్ల 20 వేల కోట్ల రూపాయిలు అప్పు తెచ్చి జీతాలు ఇస్తున్నారు.  ధనిక రాష్ట్రం ను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.
పుట్టే బిడ్డ కూడా 1.25 లక్షల అప్పుతో పడుతున్నారు.  కాగ్ రిపోర్ట్ ఇచ్చింది..  ఈ బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది అని.  తాగితే వచ్చే ఆదాయం 37 వేల కోట్లు ఊరు ఊరుకో బెల్ట్ షాప్ పెట్టాడు కెసిఆర్. లక్షలమంది యువత తాగుడికి బానిస అయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే అమ్మ నాన్నను చంపుతున్నారు. తాగి భర్తలు చనిపోతే భార్యలు వితంతువులు అవుతున్నారు.  తాగుడు ద్వారా వచ్చిన డబ్బుతోనే కెసిఆర్ పెన్షన్లు ఇస్తున్నారు.  ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఎవరి మీద ఎవరు బ్రతుకుతున్నారు?  కెసిఆర్ అరచేతిలో బెల్లం పెట్టీ మొచేతివరకునాకిస్తున్నారు.  కెసిఆర్ కి భయం పట్టుకుంది.  ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మడం లేదు.  ఈ దీక్ష ఆరంభం మాత్రమే. కెసిఆర్ నియంతృత్వ పోకడను, రాజ్యాంగం అవమానం చేసిన తీరును బొందపెడతమని అన్నారు.
ఢిల్లీలో పైరవీ చేద్దాం.. బీజేపీ ఏమన్నా వింటుందేమో అని కెసిఆర్ అనుకుంటున్నావా..?  నీ కథ ముగిసింది.  ఇక్కడ ఎగిరేది కాషాయ జెండా.  2014 లో టీడీపీని, 2018 లో కాంగ్రెస్ ను మింగావు.  కానీ ప్రజలకు అర్థం అయ్యింది బీజేపీ ను ముట్టుకుంటే కెసిఆర్  మసి అవుతాడు అని.. అందుకే ఈ సారి గెలిచేది బీజేపీ. ఒడేది కెసిఆర్.  బీజేపీ కి గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా మన తెలంగాణ.  పల్లె పల్లేన దీక్షలు పెడతాం.  ప్రజల విశ్వాసం కొలోయారు కాబట్టే మీకు pk అక్కర పడింది.  పికే ఇక్కడ పనికిరాడు.  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, చైతన్యం పని చేస్తుంది.  600 కోట్లు పెడితేనే హుజూరాబాద్ లో నిన్ను ఖతం పట్టించారు.  100 కోట్లు నియోజకవర్గానికి పంచి పెట్టినా కూడా మీరు గెలవలేరని అన్నారు.

Related Posts