YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాం చేనేత... అంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాం చేనేత...  అంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

అమరావతి మార్చ్ 17
స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరులూదిన చేనేత రంగాన్ని పరిరక్షించుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత వస్ర్తాలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. గురువారం రాజ్ భవన్ లో  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు చేనేత రంగం స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యలను గురించి గవర్నర్ కు వివరించారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మగమగ్గాల పోటీని సైతం తట్టుకుని అరుదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న చేనేత కార్మికులు అభినందనీయులన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి సహకారం అందించటం, తద్వారా వారు నిరంతర ఉపాధిని పొందగలగటం మంచి పరిణామమన్నారు. యువత ఆదరణతోనే ఈ రంగం మరింత స్వయం సమృద్దిని సాధించగలుగుతుందన్నారు.
ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జిఎస్ టి విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని విన్నవించారు. వ్యవసాయ తరువాత అత్యధిక మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి జిఎస్ టి గొడ్డలి  పెట్టుగా పరిణమించిందని, కేంద్ర ప్రభుత్వం దానిని మినహాయించేలా సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ముందుచూపు ఫలితంగా నేతన్న నేస్తం పేరిట రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతి చేనేతకు సహాయం అందుతోందని, ఫలితంగా వారు మెరుగైన జీవనోపాధిని పొందగలుగుతున్నారని వివరించారు. నూతన డిజైన్లతో యువతను ఆకర్షించేలా ఆప్కో వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకవచ్చిందని, గన్నవరం, విశాఖ పట్నం, తిరుపతి విమానాశ్రయాలలో సైతం ఆప్కో కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ నేపధ్యంలో సానుకూలంగా స్పందించిన గవర్నర్ జిఎస్ టి మినహాయింపు విషయంలో తగిన సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.  

Related Posts