YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండుగా చీలుతున్న జేడీఎస్‌

 రెండుగా చీలుతున్న జేడీఎస్‌

కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా జేడీఎస్‌ పార్టీలో బీజేపీ వర్గపోరు చిచ్చును రాజేసింది. దేవేగౌడ రెండో తనయుడు రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.దీంతో కర్ణాటక రాజకీయాలు మరోమారు కీలక మలుపు తీసుకున్నాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్‌తో రేవణ్ణ వర్గం మద్దతు పార్టీకి ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.దీంతో జేడీఎస్‌లో చీలిక తలెత్తుతుందోమోనేనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే సీఎం పదవిని కూడా జేడీఎస్‌కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌కు కుమార‌స్వామి కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేస్తే.. బీజేపీ మాత్రం దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసింది. రేవణ్ణకు 12మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. అయితే పార్టీలో ఏర్పడిన ఈ చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Related Posts