విజయవాడ, మార్చి 19,
వీవోఏ నాగలక్ష్మి సూసైడ్ బందరులో ఉద్రిక్తతను పెంచింది. వైసీపీ నేత లైంగిక వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందంటూ బంధువులు ఆందోళనకు దిగారు.. చివరకు నిందితుడు గరికపాటి నరసింహారావును పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ నాయకుడు నరసింహారావు వేధింపులతో నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలతో ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ లీడర్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే, ఏపీలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం అవుతుందన్నారు చంద్రబాబు. ప్రజలు ప్రాణాలు, బాధితుల వేదన కంటే… పోలీసులకు ప్రాధాన్యత ఏంటని ప్రశ్నించారు.నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వాళ్లందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు తోటి వీఓఏ లు. అధికార పార్టీ అండ, మంత్రి భరోసా చూసుకునే.. నరసింహరావు అరాచకాలకు పాల్పడేవాడని నాగలక్ష్మి సోదరుడు తెలిపారు. పదేపదే వెంటపడి వేధించడంతోనే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని అన్నారువీఏవో నాగలక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ నేత గరికపాటి నరసింహారావును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే, వీవోఏ నాగలక్ష్మి కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఏమీ లేదంటున్నారు ఉన్నతాధికారులు