YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పెగాసెస్ రచ్చ

ఏపీలో పెగాసెస్ రచ్చ

విజయవాడ, మార్చి 19,
ఏపీలో ప్రభుత్వం వైసీపీది. అధికారం మొత్తం వైసీపీ చేతుల్లో ఉంది. గత పాతిక, ముఫ్పై ఏళ్ల కిందటి ఫైల్స్ అన్నీ వెలికి తీయడం క్షణాల్లో పని. నిజానికి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్ని కావాలో అన్ని ఫైల్స్ వెదికారు. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని కేసులు పెట్టారు. అయితే ఈ కేసుల్లో పెగాసస్ లేదు. పెగాసస్ రూ. పాతిక కోట్ల విలువైనది. కొనాలంటే .. దానికో పద్దతి ఉంటుంది. చంద్రబాబు నేరుగా పాతిక కోట్లు ఇచ్చి పెగసస్‌ను జేబులో పెట్టుకోలేరు. దానికో పద్దతి ఉంటుంది. అది కొన్నారో లేదో స్పష్టమైన లెక్క ఉంటుంది. పెగసెస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తుంది. ఇదే అంశంలో తాజాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన కామెంట్స్‌ చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. బాబు అధికారంలో ఉండగా.. పెగసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ చెప్పారన్నారు. పెగాసెస్‌తో సంబంధం లేదని టీడీపీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పెగాసెస్‌పై పూర్తి విచారణ జరిగితే టీడీపీ బండారం బయట పడుతుందన్నారు అంబటి.బాబు.. పెగసెస్ సాఫ్ట్‌వేర్‌ వాడారని తాము అనలేదని.. సాక్షాత్తూ ఓ సీఎం అన్నారని తెలిపారు. మమత వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు అంబటి రాంబాబు. తప్పు చేయకపోతే.. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో టీడీపీ నేతలు చెప్పాలన్నారు ఫైర్ అయ్యారు అంబటి. పెగాసస్ చంద్రబాబు కొన్నారని మమతా బెనర్జీ చెప్పారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. వారి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఓ రకంగా సారా మరణాలు.. ఇతర అంశాలు పూర్తిగా పక్కపోయేలా వారు హడావుడి చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్లు వచ్చి చంద్రబాబు వాడే ఉంటారని ్నడం ప్రారంభించారు. కానీ చంద్రబాబు పెగాసస్ కొని ఉంటే.. నిమిషాల్లోనే డాక్యుమెంట్లు బయటకు వచ్చి ఉడేవి. కానీ ఇప్పటికీ మమతా బెనర్జీ అన్నారనే ప్రచారం చేస్తున్నారంటే.. అలాంటిదేమీ లేదని అర్థమని టీడీపీ నేతలు చెబుతున్నారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ కేంద్రం అనుమతిస్తేనే కొనాలి. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన అభియోగాల్లో కూడా ఓ నిఘా పరికరం కొనాలనుకున్నారు. అది కూడా కేంద్రం అనుమతితోనే జరిగింది. కేంద్ర సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలనుకున్నారు. కానీ చివరికి కొనలేదు. పెగాసస్ అంశంలోనూ అంతే. కానీ వైసీపీ బరద చల్లడానికే ప్రాధాన్యం ఇస్తోంది. పెగాసస్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇంత వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు రాలేదు. తొలి సారి మమతా బెనర్జీ ఈ ఆరోపణలు చేశారు. ఆమె ఎందుకు చంద్రబాబు పేరు ప్రస్తావించారో కానీ.. ఇప్పుడు ఆ పేరుతో టీడీపీపై బురద చల్లడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మమత ఆ మాటలు మాట్లాడటం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related Posts