YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేబినెట్ విస్తరణ అడుగులు

కేబినెట్ విస్తరణ అడుగులు

హైదరాబాద్, మార్చి 19,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఎప్పుడు ఏ నిర్ణయం తెసుకుంటారో, ఏ నిర్ణయం ఎందుకు తీస్కుంటారో, ఎవరకీ అర్థం కాదు. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విషయంలో అయితే, ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక  స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని పార్టీ నాయకులే కాదు, ప్రత్యర్ధి పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు కూడా గంటకొట్టి మరీ చెపుతున్నారు. మరోవంక, ఎలక్షన్ కాబినెట్’ మీద ముఖ్యమంత్రి కసరత్తు చేతున్నారని, కొద్ది రోజుల్లోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. నిజానికి శాసన సభ బడ్జెట్ సమావేశాలకు ముందే, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన వెంటనే, ముఖ్యమంత్రి రాజకీయంగా,పాలనా పరంగా పావులు కదుపడం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించరు. నామినేటెడ్ పదవుల పందారానికి శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో మత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అలాగే, కడియం, కవిత సహా మరి కొన్ని పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఎందుకనో, ఆ ముహూర్తం వెనక్కి పోయింది. కానీ, ఇప్పుడు పక్కాగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అది కూడా మరో పక్షం రోజుల్లోగా ఉంటుంది విశ్వసనీయ వర్గాలు ఘంటాపథంగా చెపుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ, ఏప్రిల్ 2 ఉగాది రోజున మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం జరిపిన సర్వేలో అనేక మంది మంత్రులకు నెగటివ్ మార్కులు వచ్చినట్లు సమాచరం. మంత్రుల ప్రవర్తన ప్రభుత్వ వ్యతిరికేతకు మరింతగా పెంచే విధంగా ఉందని, అదే విధంగా  మంత్రులు సొంత జిల్లాల్లో ఎదుర్కుంటున్న ప్రజా వ్యతిరేకత ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, పీకే టీమ్’గుర్తించింది. ఈ నేపధ్యంలో మచ్చ తెచ్చే మంత్రులకు ఉద్వాసన చెప్పాలని, ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో, తప్పుడు ఎన్నికల అఫిడవిట్’  సహా ఇతర ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి శ్రీనివాస గౌడ్, గ్రానైడ్ కేసులో ఈడీ విచరణను ఎదుర్కుంటున్న గంగుల కమలాకర్’తో పాటు మరి కొందరు మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రశాంత రెడ్డి పేరు కూడా ఉద్వాసన జాబితాలో ఉందని అంటున్నారు. అలాగే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, తో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన హోమ్ మంత్రి మహ్మూద్ ఆలీని కూడా మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి కేసేఅర్ వీరవిధేయుడిగా పేరొందిన,మంత్రి వర్గంలో ఉన్న ఒకే ఒక్క ముస్లిం ఫేస్, మహ్మూద్ ఆలీని తప్పించడానికి స్పష్టమైన కారణం ఏదీ కనిపించక పోయినా , రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయనకు, విశ్రాంతి ఇవ్వాలని ముఖ్యమత్రి నిర్ణయించినట్లు సమాచారం.అదే విధంగా, మంత్రివర్గంలో ఉద్యమ వ్యతిరేకులకు పెద్ద పీట వేశారనే ఆరోపణ బలంగా వినవస్తున్న నేపధ్యంలో, ‘ఫిరాయింపు’ మంత్రులో ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదాని అంటున్నారు. కాగా, గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ స్థానంలో అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు చోటు దక్కటం ఖాయమనేది పార్టీ వర్గాల అంచనా. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండాను, మండలికి తీసుకొచ్చేందే, అందుకని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇక, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాలను అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోందని అంటునారు. అలాగే, ఇక ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలు ఇతరేతర కార్యక్రమాలను పక్కన పెట్టి పూర్తిగా రాష్ట్రం’ పైనే దృష్టి పెడతారని అంటున్నారు.

Related Posts