YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అమ్మో..ఎండలు

అమ్మో..ఎండలు

హైదరాబాద్, మార్చి 19,
నిన్నమొన్నటివరకూ చలికాలం చంపేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పులి పంజా విసిరింది. చలికాలం విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ సూరీడు మండిపోతున్నాడు. సెగలు కక్కుతూ.. విరుచుకుపడుతున్నాడు. శివరాత్రి ముగిసిన వెంటనే చలి తగ్గుతుంది కానీ మరీ ఇంత వేడి వుండడం అరుదు అంటున్నారు జనం. వేసవికాలం వచ్చేసిందనడానికి దండి కొడుతున్న ఎండలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతూ.. జనాలను హడలెత్తిస్తున్నాయి.తెలంగాణలో గురువారం అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ణంగా పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, జగిత్యాల, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో 42.8 డిగ్రీలు నమోదు. ఆదిలాబాద్ అర్బన్ లో 42.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా కౌటాలలో 42.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో 42.6డిగ్రీలు, నర్సాపూర్ (జీ)లో 42.5 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోనూ.. ఎండాకాలం మంటలు ప్రారంభం అయ్యాయి. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరాయి. రాత్రి 8 గంటలైనా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నామంటున్నారు జనం. ఎండలోకి వెళ్ళేముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ కాకుండా మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Related Posts