YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

44 వేలకు చేరిన మిర్చి

44 వేలకు చేరిన మిర్చి

వరంగల్, మార్చి 19,
ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్‌కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం మిర్చి క్వింటాల్ ధర రూ.37 వేలు పలికింది.మరోవైపు సింగిల్ పట్టీ రకం మిర్చి కూడా రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర రూ.42,500 పలికింది. మిర్చి పంట‌కు తెగులు సోక‌డం, దిగుబ‌డి త‌గ్గిపోవ‌డంతో పాటుగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండ‌టంతోనే ఈ త‌ర‌హాలో రికార్డు స్థాయి ధ‌ర‌లు న‌మోద‌య్యాయని ఎనుమాముల మార్కెట్ అధికారులు చెబుతున్నారు. అటు పత్తి పంటకు కూడా రికార్డు ధర లభిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర రూ.10,500 పలికింది.

Related Posts