అదిలాబాద్, మార్చి 19,
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` సినిమాకు దేశంలో విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లవరకు వసూల్ చేసింది. అనుపమ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. పల్లవి జోషి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. మోడీతో పాటు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు సినిమాను ప్రశంసించారు. అయితే ఈ సినిమా పై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా కురిపిస్తున్నారు కొందరు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ దగ్గర గందరగోళం నెలకొంది. ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్‌లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రదర్శన సమయంలో ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్‌కు జై అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆగ్రహించిన ప్రేక్షకులు వారి పై దాడి చేశారు. దాంతో వారు పరారైనట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపు చేశారు. అయితే మద్యం తాగిన మైకంలో మరో దేశానికి జైకొట్టిన అనంతరం పరారైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కాశ్మీర్ ఫైల్స్ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లలో మాత్రమే సినిమా రిలీజ్ అయ్యింది. కానీ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కి పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి