YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

గ్లోబల్ లీడర్ గా మోడీ

గ్లోబల్ లీడర్ గా మోడీ

న్యూఢిల్లీ, మార్చి  19,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే నెంబర్‌ వన్‌.. ఆయన దరిదాపుల్లో ఎవరూ లేరు. ప్రపంచస్థాయి బలమైన నేతల్లో ప్రధాని మోడీ మరోసారి నెంబర్‌ వన్‌‌గా నిలిచారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ప్రధాని ఇమేజ్‌ మరింత పెరిగింది. పైగా యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో వన్‌సైడ్‌ విజయంతో బీజేపీతోపాటు మోదీ ప్రతిష్ట రెట్టింపయింది. తాజాగా జరిగిన సర్వేలో అతి మరింత స్పష్టంగా కనిపించింది. 13 దేశాల నేతలపై సర్వే జరిగితే మోడీ నెంబర్‌ వన్‌గా నిలిచారు. దాంతో ఆయన గ్లోబల్‌ లీడర్‌గా ఆ సర్వేలో అవతరించారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ ఈ సర్వే చేసింది. గ్లోబల్‌ లీడర్‌ ఎవరు అన్న అంశంపై ఈ నెల 9 నుంచి 15 వరకు జరిగిన సర్వే ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. 13 దేశాల నేతలపై అభిప్రాయ సేకరణ జరిగింది. తాజాగా మార్నింగ్‌ కన్సల్ట్‌ ప్రకటించిన సర్వేలో మోదీకి పట్టంకట్టారు ప్రజలు. సర్వే జరిగిన దేశాల్లో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, మెక్సికో, సౌత్‌ కొరియా, స్పెయిన్‌, యూకె ఉన్నాయి.ఈ అన్ని దేశాల్లోకెల్లా మోడీకే అత్యధికంగా అనుకూలత వ్యక్తమైంది. 77 శాతం మంది మోడీకి మద్దతు పలికారు. 17 శాతం మాత్రమే వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. మోదీ తర్వాత మెక్సికో ప్రెసడెంట్‌ ఆండ్రస్‌కు 63 శాతం అనుకూలత కనిపించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు మాత్రం కేవలం 41 శాతమే అనుకూలత ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయనపై 51 శాతం వ్యతిరేకత వ్యక్తమైందని మార్నింగ్‌ కన్సల్ట్‌ ప్రకటించింది. ప్రతి వారం ఈ సర్వే ఫలితాలను అప్‌డేట్‌ చేస్తారు. తాజా వీక్‌లో మోడీ నెంబర్‌ వన్‌గా నిలిచారు. అమెరికా కేంద్రంగా మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ పని చేస్తోంది. ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ప్రధాని మోడీ.ఈ మేరకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ట్విట్ చేసి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచ నాయకుడిగా కొనసాగుతున్నారు. 77% రేటింగ్‌తో ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్‌లలో ముందుండటం గర్వకారణమన్నారు. ప్రధాని మోదీ ప్రజల నాయకుడంటూ కొనియాడారు.

Related Posts