YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడో ఫ్రంట్ కు దారేది

మూడో ఫ్రంట్ కు దారేది

తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ, కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాలే లక్ష్యంగా... కోసం చాలా రాష్ట్రాలు తిరుగుతున్నారు. ఇటీవ‌లే క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌ల‌కు ముందు జేడీఎస్ అధ్య‌క్షుడిని క‌లిశారు. ప్ర‌జ‌ల‌ను భాజ‌పా, కాంగ్రెస్ పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని కోరారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ జేడీఎస్ పార్టీని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కుమార‌స్వామిని ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని కోరారు. దీనికి జేడీఎస్ వైపు నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రభుత్వాల ఏర్పాటు అనే కేసీాఆర్ ఆలోచన ఎంత వరకూ ముందుకువెళుతుందా అని రాజకీయ విశ్లేష‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. అందులో సగం సీట్లు గెలుచుకున్న వారికి అధికారం ద‌క్కుతుంది. 2013లో బీజేపీ 40 సీట్లు గెల‌వ‌గా ఈ ఎన్నిక‌ల్లో 104 గెలుచుకుంది. అయితే మెజారిటీ మార్కు 113గా ఉంది. మ‌రో రెండు స్థానాల‌కు ఈ నెల‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయి. కాంగ్రెస్, జేడీఎస్‌కు క‌లిపి 116 వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు. ఇత‌రులు జేడీఎస్, కాంగ్రెస్ క‌లిసి ఏర్పాటు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలిపే వీలుంది. 

Related Posts