YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్‌ ఇంట నాటకం

జగన్‌ ఇంట నాటకం

విజయవాడ, మార్చి 19,
వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం.. ఆయన ఏడాది పాలన పూర్తి అయిన కొద్దిరోజులకే.. ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైయస్ షర్మిల.. పక్కా రాష్ట్రం తెలంగాణలో వైయస్ఆర్‌టీపీ స్థాపించడం.. అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడం.. రైతులు నిరుద్యోగులు ఆత్మహత్యల నేపథ్యంలో వారికి మద్దతుగా దీక్షలు, నిరసనలు చేపట్టడం... ఆ తర్వాత తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రను తాజాగా ఆమె పున:ప్రారంభించడం..మరోవైపు వైయస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కుమార్.. ఇటీవల రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ కావడం.. ఆ తర్వాత ఆ కొద్ది రోజులకే విజయవాడలో బ్రదర్ అనిల్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ కులాల వారిగా వారితో సమావేశం కావడం.. మళ్లీ మార్చి 14న విశాఖపట్నం వేదికగా.. ఓ హోటల్‌లో ఇదే కుల సంఘాలతో బ్రదర్ అనిల్ భేటీ కావడం..  అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి బీసీ సీఎం కావాలనే డిమాండ్ ఉందంటూ కొత్త పల్లవి అందుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక పెద్ద స్కెచే ఉందని తెలుగు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన నాటి నుంచి నేటి వరకు చోటు చేసుకున్న పరిస్థితులు.. పరిణామాలు పరిశీలిస్తే... వాటి తాలుక అంశాలను ఓ సారి వరుసగా టచ్ చేస్తే... ఇదంతా ఓ పథకం ప్రకారం నడుస్తోందనే చర్చ కూడా తెలుగు నాట చాలా బలంగా వినిపిస్తోంది. వైయస్ జగన్ 16 నెలలు జైలుకు వెళ్లడం.. జగనన్న వదిలిన బాణమంటూ వైయస్ షర్మిల.. జగనన్న కోసం పాదయాత్ర చేయడం.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కొలువు తీరడం.. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి.. ప్రజల్లోకి వెళ్లడం.. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కొడి కత్తి దాడి.. ఆ తర్వాత మహానేత వైయస్ఆర్ బయోపిక్ యాత్ర విడుదల కావడం.. ఈ ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ ఘన విజయం సాధించడం.. ఆయన సీఎం కూర్చి ఎక్కడం .. ఇలా ఈ మొత్తం ఎపిసోడ్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఓ పకడ్బందీ పథకం ప్రకారం నడిచిందనే చర్చ కూడా తెలుగు ప్రజల్లో గట్టిగా సాగుతోంది.  ఇంకోవైపు సీఎం వైయస్ జగన్‌తో విభేదాల కారణంగా.. వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల తెలంగాణకు వెళ్లారంటూ.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేయడం.. మరోవైపు తెలంగాణలో కంటే... ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి... వాటి వల్ల ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి విజయమ్మకు, షర్మిలకు కూడా తెలుసు. కానీ వీటిపై వీరు కనీసం స్పందించిందీ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.పోని రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు దీక్షలు, నిరసనలు చేపట్టినా. .. వారికి మద్దతుగా వీరిద్దరు ఒక పలుకు పలికిందీ కూడా లేదు. అమరావతి రైతులు దీక్ష చేపట్టిన తర్వాత.. ఆ క్రమంలో వందలాది మంది రైతులు మరణించారు. కానీ వారి కోసం వీరిద్దరు ఒక్క కన్నీటు బొట్టు కూడా రాల్చిందీ కూడా లేదన్న సంగతి అందరికి తెలిసిందే. జగనన్నకు ఒక్క చాన్స్ ఇయ్యండి.. రాజన్న రాజ్యం తీసుకు వస్తాడంటూ.. గతంలో వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల పాదయాత్ర చేసి ఢంకాభజాయించీ మరీ చెప్పారు. మరి అలాంటిది.. ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలపై వీరు స్పందించకుండా.. పక్క రాష్ట్రం అంటూ అక్కడకు వెళ్లి వీళ్లు రాజకీయం చేయడం ఏమిటని తెలుగు ప్రజలు సంశయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు.. పాదయాత్ర సందర్బంగా వైయస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి.. ఆయన పథకాల అమలు కూడా అంతఅంత మాత్రంగానే ఉందన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పథకం ప్రకారం.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు వైయస్ విజయమ్మ, వైయస్ జగన్, వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్.. ఇలా విడిపోయినట్లు నటిస్తూ రాజకీయాలకు తెర తీశారనే చర్చ అయితే తెలుగు నాట ప్రచారంలో ఉంది.షర్మిల భర్త బ్రదర్ అనిల్ సువార్త సభలు పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ఆయన ఇటీవల విజయవాడలో కుల సంఘాలతో భేటీ తర్వాత త్వరలో మీకు శుభవార్త చెబుతానంటూ ప్రకటించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఓట్లు చీల్చే కార్యక్రమాన్ని ఈ ఫ్యామిలీ భూజానికి ఎత్తుకొందని.. ఆ క్రమంలోనే ఈ తరహా ఎత్తుగడలకు తెర తీసిందనే చర్చ అమరావతిలో చాలా రంజుగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పలు పార్టీలకు బీసీల ఓట్లే కీలకం.. ఇంకా చెప్పాలంటే ఆయా పార్టీలు ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించేదీ ఈ బీసీ వర్గం తాలుకా ఓట్లే. ఈ నేపథ్యంలో బీసీల ఓట్లు చీల్చేందుకు ఓ పథకం ప్రకారం బ్రదర్ అనిల్ కొత్త కథకు తెర తీశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన పాలనతో.. ప్రజలలో వ్యతిరేకత తీవ్రమైందీ. ఈ నేపథ్యంలో బయటకు అంతా విడిపోయినట్లు నటిస్తూ.. ఓట్లు కోసం గాలం వేసే ప్రక్రియకు ఈ వైయస్ ఫ్యామిలీ శ్రీకారం చుట్టిందనే చర్చ కూడా పులివెందుల సాక్షిగా నడుస్తోంది. మరోవైపు.. వైయస్ జగన్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాల మేరకే వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారనే తెలుస్తోంది. మరి ఈ ఉచ్చులో ప్రజలు పడతారో లేక.. తమ బుద్ది బలానికి పని చెప్పి.. రానున్న ఎన్నికల్లో సరైన పార్టీ లోని సరైన అభ్యర్థికి ఓటు వేస్తారేమో చూడాలి.

Related Posts