YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడపలో సెంటిమెంట్ పాలిటిక్స్

కడపలో సెంటిమెంట్ పాలిటిక్స్

కడప, మార్చి 19,
రాజకీయాల్లో నాయకులు సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటారు. ఎంతలా అంటే.. దాని కోసం ఏదైనా చేసేస్తారు. కడపజిల్లా, కమలాపురం రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేను ఓ భయం వెంటాడుతోందట. దానికోసం కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఏమిటా సెంటిమెంట్‌? ఏమిటా కథ? కడప జిల్లా కమలాపురం పాలిటిక్స్‌లో ఇప్పుడో సెంటిమెంట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ ఎవ్వరైనా వరుసగా రెండు సార్లు మాత్రమే గెలుస్తారంట. మూడోసారి పోటీ చేస్తే.. ఎంతటోళ్లయినా ఓడిపోతారట. ఈ సెంటింట్ దెబ్బకి తోపులనుకున్నవాళ్లు సైతం మూటాముల్లె సర్దుకున్నారట. రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పినవాళ్లు కూడా మూడోసారి చిత్తయిన రికార్డు ఇక్కడ ఉంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1985వరకు.. ఎవ్వరైనా ఒక్కసారే. ఆ తర్వాత ఎమ్మెల్యే మారిపోయేవారట. అయితే, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అవకాశం ఇస్తున్నారట ఇక్కడి ప్రజలు. మూడోసారి పోటీ చేస్తే మాత్రం ఓటమి తప్పడం లేదట. అలా రెండుసార్లు గెలిచినవాళ్లలో.. మైసూరా రెడ్డి , వీరశివారెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఉన్నారు..ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి కూడా వైసిపి నుంచి రెండు దఫాలు గెలిచారు. అయితే, సెంటిమెంట్‌ ప్రకారం..ఈ సారి రవీంద్రనాధ్ రెడ్డికి ఓటమి తప్పదని స్దానికంగా గుసగుసలు మొదలయ్యాయట. సీఎం జగన్‌కు మేనమామే అయినా.. మూడోసారి సెంటిమెంట్‌తో రవీంద్రనాధ్ రెడ్డిలో భయం మొదలైందట. అందుకే, ఈ సారి తన కొడుకు రామాంజుల రెడ్డిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట.ప్రస్తుతం చింతకొమ్మదిన్నె నుంచి జెడ్పీటీసీ గా ఉన్న రామాంజులరెడ్డి రాజకీయ రంగప్రవేశం కూడా సెంటింట్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. రవీంద్ర నాధ్ రెడ్డి మొదటిసారి గెలిచిన చింతకోమ్మదిన్నె నుంచే zptcగా ఉన్నారు ఆయన కుమారుడు. శాసన సభ్యుడిగా కూడా కమలాపురం నుంచి పోటీ చేయిస్తే సెంటిమెంట్ వర్కవుట్‌ అవుతుందనే ఉద్దేశంతో రవీంద్రనాథ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్‌ పరంగా ఇక్కడ మూడో సారి గెలిచే అవకాశం కూడా తక్కువగా ఉండటంతో.. తనకు బదులు కొడుకు రంగంలోకి దింపితే.. ఎమ్మెల్యే పదవి తన కుటుంబం నుంచి చేజారకుండా ఉంటుందని భావిస్తున్నారటరవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురంలో తన కొడుకును బరిలో దింపి.. తాను కడప నుంచి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. మూడోదఫా గండాన్ని ఇలా గట్టెక్కితే… మంత్రి పదవికూడా దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్నారట రవీంద్రనాధ్ రెడ్డి. ఒకవేళ సీఎం జగన్‌.. రవీంద్ర నాధ్ రెడ్డిని కమలాపురం నుంచే పోటీ చేయాలని ఆదేశిస్తే మాత్రం… సెంటింట్‌ను అధికమించి గెలుస్తారా? అనేదే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

Related Posts