YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎవరికి బెర్తులు

ఎవరికి బెర్తులు

విజయవాడ, మార్చి 19,
ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు. దాదాపు కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరూ రాజీనామా చేయాల్సిందే. జగన్ ను దగ్గరగా చూసిన వారెవ్వరూ తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించలేరు. ఆయన లెక్కలు ఎవరికీ అర్థంకావు. అనేక విషయాల్లో ఈ అంశం స్పష్టంగా తేలింది. తాను అనుకున్న వారిని కూడా రాజకీయం కోసం సులువుగా బయట ఉంచగలరు. పదవుల ఎంపికలో.... రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల ఎంపిక చూస్తేనే జగన్ ఆలోచనధోరణి చెప్పకనే తెలుస్తుంది. ఊహించని వారికి ఎమ్మెల్సీ పదవులు లభించాయి. జగన్ విజయం కోసం కృషి చేసిన ఎంతోమంది తమకు వస్తుందని పెట్టుకున్న నమ్మకం ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో వమ్మయింది. అందుకే జగన్ నవ్వు చూసి, పలకరింపు చూసి తమకు మంత్రి పదవి వస్తుందనుకుంటే అది పొరపాటే. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలియంది కాదు.  కొందరికే ఛాన్స్... ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని కొనసాగుతారంటున్నారు. మిగిలిన వారంతా రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసిన మంత్రులను జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమిస్తామని జగన్ చెప్పారు. 26 జిల్లాలు కానుండటంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి వారి సేవలను వినియోగించుకోవాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు. దీంతో మంత్రి పదవులు ఎవరికి వస్తాయన్నది ఊహించడం కూడా కష్టమే.  అయితే జిల్లాల వారీగా అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేతల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లు సయితం తమకు మంత్రి పదవి దక్కుతుందన్న అంచనాలో ఉన్నారు. అయితే ఇది ఎన్నికల కేబినెట్ కావడంతో జగన్ సామాజికవర్గాల సమీకరణాలు, జిల్లాలో ప్రభావం చూపగలిగిన నేతలకే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. అందుకే జగన్ ను ముందుగా అంచనా వేయడం కష్టమే. రాజ్ భవన్ కు మంత్రివర్గ జాబితా చేరే వరకూ దానిపై స్పష్టత రాదన్నది వాస్తవం

Related Posts