YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మహాత్ముని బాటలేనే కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి

మహాత్ముని బాటలేనే కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి

నాందేడ్
మహారాష్ట్ర జల్ గావ్ జైన్ హిల్స్ లో గాంధీ తీర్ధ్ మ్యూజియాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు  బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ అందరి ఉన్నతి మహాత్ముని ఆకాంక్ష. సర్వోదయ అనే పదం యొక్క అర్ధమే అది. మహాత్ముని బాటలో అహింసా మార్గంలో తెలంగాణ సాధించిన కేసీఆర్. మహాత్ముని బాటలోనే సమాజంలోని సబ్బండవర్ణాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగిన మహాత్ముని సంపూర్ణ జీవితంపై మ్యూజియా ఏర్పాటు అధ్భుతం. ప్రపంచంలోనే ఇది అరుదైన అతిపెద్ద మ్యూజియం .. అభినందనీయం. మహాత్ముని పట్ల ఎంతో తపన, ఆరాధన, అంకితభావం ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు. మహాత్ముని జీవితంపై జాన్ రస్కిన్ ప్రభావం అతి ఎక్కువగా ఉండేది .. సత్యం, అహింస, అందరి ఉన్నతి ఇందులో ముఖ్యమైనవి. ఈ అంశాలను ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో ఉటంకించడం జరిగిందని అన్నారు.

Related Posts