విజయవాడ
విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాల్ కి నిరసన తెలుపుతు టీడీపీ కార్పొరేటర్లు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, కార్పొరేటర్ కేశినేని శ్వేత మీడియా తో మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వైసీపీ పాలకపక్షం. బడ్జెట్ నగర ప్రజలకు గుదిబండగా మారబోతుందని అన్నారు.
గత మూడు సంవత్సరాలు నుండి నగరంలో వైసిపి చేసిన అభివృద్ధి శూన్యం. గత సంవత్సర కాలం నుండి ఉన్న వైసిపి పాలకపక్షం రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. విజయవాడ నగరంలో స్థానిక మంత్రి ఉండి కూడా నగరం అభివృద్ధికి నోచుకోకపోవడం సిగ్గుచేటు. నగరంలో రోడ్లు కన్నా రోడ్లు పైన గుంటలు ఎక్కవగా ఉన్నాయని అన్నారు. గత సంవత్సర కాలం నుండి వైసిపి పాలకపక్షం నగర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి నిధులు తీసుకువచ్చే తీరిక లేకుండా ఉన్నారు నగరంలో చెత్త పన్ను ఒక దరిద్రం అనుకుంటే వసూలు చేస్తున్న విధానం మరింత వింతగా ఉంది. రానున్న రోజుల్లో వైసిపి పాలకపక్షం ఓ కొత్త పథకం తీసుకు రాబోతుంది పన్ను కట్టకపోతే ఇల్లు జప్తు చేసి మున్సిపల్ వాహనాల్లో సామాన్లు పట్టుకుపోతారంట. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేక వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం లబ్ధిదారులను తగ్గిస్తున్నారు. భవిష్యత్లో నగరంలో మీ నాయకులు నిర్వహించే గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పుటకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.