నాగర్ కర్నూలు
టి.ఆర్.యస్ పార్టీలో ముసలం మొదలైంది...మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పై సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని ఘాటుగా విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని వార్డులలో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే అధికారులను సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ ఆదేశించారు. విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ....మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ మరో సారి ప్రజలను మోసం చేస్తున్నారు...కోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు...సింగోటం బ్రిడ్జికి కోర్టులో తీర్పు అనుగుణంగా డబ్బులు వచ్చాయి...అయిన నేను ఎమ్మెల్యే కాలేదు..అది నా చిన్నప్పుడు జరిగిన విషయం అన్నారు. కుడికిల్ల రైతులను మోసం చేసి ముసలి కన్నీరు కారుస్తున్నాడు, అప్పటి ప్రోజెక్టుల భూ సేకరణ పై సిఐడి విచారణ వేయాలని కోరారు. గతంలో ఎవరి బ్రతుకు ఎవరి చరిత్ర ప్రజలకు తెలుసు, రైతుల గురించి మాట్లాడితే అది నోరా లేక మొరా, రైతులు నీ నోరును పిన్నాయల్ పోసి కడుగుతారని మాజీ మంత్రి పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా అపార్ట్మెంట్లు కట్టి నివ్వు ఆడిన నాటకం తెలియదా అని విమర్శించారు. ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తే అబివృద్ది చేయకుండా గ్రామాలలో దౌర్జన్యాలు చేయించావు...శాంతి భద్రతలను లేకుండా చేసింది మిరే అన్నారు. బ్రిడ్జి, మామిడి మార్కెట్, గోపాల్ దీన్నే కెనాల్, హైవే, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 15కోట్లు అబివృద్ది కదా...వయస్సు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదని జూపల్లి పై ఎమ్మెల్యే బీరం ఘాటు వ్యాఖ్యలు చేశారు...