YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆసియా లోనే అతిపెద్ద రక్షణ రంగ సంస్థ సీఆర్పిఎఫ్

ఆసియా లోనే అతిపెద్ద రక్షణ రంగ సంస్థ సీఆర్పిఎఫ్

రాజమహేంద్రవరం
సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ 83వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం రాజమహేంద్రవరం లాలా చెరువులోని సీఆర్పీఎఫ్ 42  బెటాలియన్ ప్రాంగణంలో  బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ ఆద్వర్యంలో సెకండెంట్ కమాండెంట్ చింతల్ కుమార్ పర్యవేక్షణలో డిఫ్యూటీ కమాండెంట్ రత్నమ్మ, అసిస్టెంట్ కమాండెంట్ గీతమ్మ లు సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పిఎఫ్ 42 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ రత్నమ్మ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ బెటాలియన్ 42 బెటాలియన్ 1932 జూలై 27వ తేదిన ఏర్పాడిందని తెలిపారు. ఇప్పటికి  83 సంవత్సరాలు అయిందని తెలిపారు. సీఆర్పీఎఫ్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద రక్షణ శాఖ విభాగమని ఆమె తెలిపారు. ఈ విభాగం దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు, మారు మూల ఏజన్సీ ప్రాంతాలలో మావోయిస్టుల నుంచి వచ్చే ముప్పును అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏజన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన యువకులు మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా నిరుద్యోగ యువతకు వివిధ చేతి వృత్తులలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లుకు  సెకండెంట్ ఇన్ కమాండెంట్ సీతల్ కుమార్  పూల గుచ్చులతో నివాళులర్పించారు. గార్డుఆఫ్ ఆనర్  చేశారు. దీనిలో భాగంగా సి.ఆర్ఎఫ్ జవాన్లు ధైర్యాశాహసాలతో కొన్ని విన్యాశాలు చేశారు. స్కూల్ విద్యార్థులకు ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. ఆయుధాలు   ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ కమాండెంట్  బి. రత్నమ్మ ,  గీతమ్మ, జవాన్లు, ఆర్.జి.ఎం. హై స్కూల్ విద్యార్థులు, ఉపాద్యాయులు,  పాల్గొన్నారు.

Related Posts