న్యూఢిల్లీ
దేశ ప్రజలు వెంటనే వలసవాద మైండ్‌సెట్ నుంచి బయటపడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వలస వాద మైండ్ సెట్ నుంచి బయటపడి, సొంత అస్తిత్వవాదం వైపు మొగ్గు చూపాలని హితవుపలికారు. మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా తిరస్కరించాలని, ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చి, విద్యను కొందరికే పరిమితం చేశారని అన్నారు. హరిద్వార్‌లోని సంస్కృతి విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వసల పాలకులు మనల్ని మనం తక్కువ చూసుకునేలా చేశారు. మన మూలాలు మరిచిపోయేలా చేశారు. దీంతో మన దేశ ఎదుగుదలే మందగించింది.విదేశీ మాధ్యమాన్ని తీసుకొచ్చి, విద్యను కొన్ని వర్గాలకే పరిమితం చేశారు. చాలా మంది విద్యకు దూరమవుతున్నారు. అంటూ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
మన సంస్కృతిని, వారసత్వాన్ని చూసి గర్వపడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన మూలాలకు తిరిగ వెళ్లాల్సిందేనని సూచించారు. మన వారసత్వాన్ని చూసి పిల్లలు గర్వపడేలా వ్యవహరించాలని, వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.