విశాఖపట్టణం, మార్చి 21,
మార్చి నెలలో ఆంధప్రదేశ్ తుఫాన్ గండాన్ని ఎదుర్కోనుంది. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం.. తుఫాన్ గా మారి.. ఏపీవైపు దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నాటికి తుఫాన్ గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది తొలి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడనుండగా.. ‘అసనిగా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 21 నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తుఫాన్ హెచ్చరికలు జరీ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండముగా మారిందని.. ఇది నికోబార్ కు వాయువ్యంగా 110, పోర్ట్ బ్లెయిర్కు కు దక్షిణంగా 170కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండముగా మారి.. అనంతరం 12 గంటలలో తుఫానుగా మారనుందని హెచ్చరించారు.