YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన నుంచి వాణీ విశ్వనాధ్ పోటీ

జనసేన నుంచి వాణీ విశ్వనాధ్ పోటీ

తిరుపతి, మార్చి 21,
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నుంచి సినీ నటి వాణీ విశ్వనాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వాణి విశ్వనాథ్ జనసేన పార్టీ తరపున ఆమె బరిలో దిగుతారా? అంటే అవుననే సమాచారం జనసేన చిత్తూరు జిల్లా స్థానిక నేతల నుంచి వస్తోంది. నగరి బరిలో జనసేన తరఫున పోటీ చేయాలని వాణీ విశ్వనాథ్ కు స్థానిక జనసేన నాయకత్వం ఆహ్వానం పలికింది. ఈ మేరకు నగరి కూడలిలో బ్యానర్లు పట్టుకొని వాణీ విశ్వనాథ్ నగరి నుంచి జనసేన తరపున పోటీచేయాలని తమ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నామని స్థానిక నాయకులు తెలిపారు.గత ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ పొత్తులో భాగంగా నగరి స్థానాన్ని బీఎస్పీ కేటాయించారు. అయితే ఈసారి జనసేన నుంచి వాణీ విశ్వనాథ్ బరిలో దిగాలని వారు కోరుతున్నారు టీడీపీ ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్, వాణీ విశ్వనాథ్ మేనేజర్ చలపతి మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి హార్డ్ కోర్ కార్యకర్త అయిన చలపతిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గాలి కుటుంబానికి వ్యతిరేకంగా చలపతి పావులు కదుపుతున్నారు.2014 ఎన్నికల ముందు కూడా వాణీ విశ్వనాథ్ ను నగరి నుంచి పోటీ చేయించాలని ప్లాన్ చేశారు. చివరి నిమిషంలో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు .ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో నగరి స్థానం నుంచి వాణీ విశ్వనాథ్ జనసేన తరపున పోటీచేయించాలని స్థానిక నాయకత్వం ఆహ్వానించడం అనూహ్య పరిణామం. మొత్తం మీద ఇప్పటికే పలు గ్రూపులుగా ఉన్న నగరి టీడీపీకి ఇది మరో తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే తమిళ ఓట్లు, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్న నగరిలో పవన్ కళ్యాణ్ కు యూత్ నుంచి మంచి పాలోయింగ్ ఉంది. నగరిలో వాణీ విశ్వనాథ్- జనసేన కాంబినేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.అయితే.. రాజకీయాల్లో కాకలు తీరిన ప్రస్తుత నగరి ఎమ్మెల్యే రోజా ముందు వాణీ విశ్వనాథ్ నిలబడగలరా అనేది సందేహాస్పదమే అని చెబుతున్నారు. నగరి నుంచి జనసేన పార్టీ నుంచి వాణీ విశ్వనాథ్ పోటీ చేస్తే మాత్రం ఆ నియోజకవరంగా టీడీపీ ఇన్చార్జి గాలి భానుప్రకాష్ కి  మాత్రం తలనొప్పి గా మారడం తథ్యమని చెబుతున్నారు.

Related Posts