YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో మరో రఘురాముడు..

వైసీపీలో మరో రఘురాముడు..

ఒంగోలు, మార్చి 21,
వైసీపీ రెబల్ నేత సుబ్బారావు గుప్తాపై అధికార జగన్ పార్టీ పరోక్షంగా వేధింపులకు గురి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా గుప్తాపై ఒంగోల్ నగర మేయర్ జి. సుజాత ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఒంగోలు మంగమూరు సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కొంతమంది వైశ్యులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్ అనుమతి కోసం వైశ్య సంఘాల ప్రతినిధులతో కలిసి సుబ్బారావు గుప్తా మేయర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా తనను సుబ్బారావు గుప్తా కులం పేరుతో దూషించారంటూ మేయర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే గుప్తాపై ఒంగోలు నగర మేయర్ పోలీస్ కేసు పెట్టడం వెనక జగన్ పార్టీలోని కీలక నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో గుప్తాపై చాలా పకడ్బందీగా. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని సమాచారం. అయితే జగన్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీలో వివిధ స్థాయిలలో ఏం జరుగుతోందో అందరికీ అంతా తెలిసిందే. ఇదే విషయాన్ని ఫ్యాన్ పార్టీలోని వారేవరూ బయటకు చెప్పే సాహసం అయితే చేయలేదనేది మాత్రం సుస్పష్టం. కానీ సీఎం జగన్ సమీప బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు సుబ్బారావు గుప్తా మాత్రం.. జగన్ పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలు.. వాటి వల్ల భవిష్యత్తులో పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎదురయ్యే సమస్యలను కట్టే.. కొట్టే.. తెచ్చే.. అన్నట్లు చెప్పేశాడు. అదీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాకా ఒంగోలులో.. అదీకూడా మంత్రి వాసన్న జన్మదిన వేడుకల వేదికగా చేసుకుని.. మొత్తానికి  మొత్తం నిజాలు అయితే కక్కిపారేశాడు. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాలో అసలు భయం మొదలై.. గుంటూరులోని ఓ లాడ్జిలో ప్రాణభయంతో దాక్కోవడం.. అతడి కోసం బాలినేని ప్రధాన అనుచరుడు సుబానీ రంగంలోకి దిగి.. గుప్తాను పట్టుకోని..  బండబూతులు తిడుతూ అతడిపై దాడి చేసి.. మంత్రి వాసన్నకు క్షమాపణలు చెప్పిండం.. సదరు వీడియో అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.  ఆ తర్వాత సుబ్బారావు గుప్తా.. ఆంధ్రాలో పలువురు కీలక నేతలతో భేటీ కావడమే కాదు.. ఆర్య వైశ్య సంఘాల నేతలతో కూడా విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి.. వారితో చర్చలు జరపడం.. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం.. ఆ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌నే కాదు.. అసరమైతే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సైతం కలుస్తానని ప్రకటించారు. అయితే ఇటీవల ఢిల్లీలో అధికార వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ను కలవడం, మంత్రి బాలినేని, అతని కొడుకుపై మళ్ళీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే.. సుబ్బారావు గుప్త పై SC, ST కేసు బనాయించారని స్థానికుల చర్చ.ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. మంత్రి కొడాలి నానికి నాలుగు మంచి మాటలు చెప్పడం.. ఆ క్రమంలో మా ఇలాకాలో మా మంత్రి బాలినేని వాసన్నను చూసి.. ఎలా యాక్షన్ చేయాలో నేర్చుకోవాంటూ కొడాలి నానికి నాలుగు శుద్దులు చెప్పారీ గుప్తా. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో గుడివాడ నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కొడాలి నానికి సవాల్ విసిరారు. ఆ తర్వాత గుప్తా ఢిల్లీ వెళ్లి.. జంతర్ మంతర్ వద్ద.. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత కొద్దికాలం సైలెంట్‌గా ఉన్నా ఈ సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సుబ్బారావు గుప్తాపై బలమైన కేసులు  నమోదు చేసి.. వాటి ద్వారా మంత్రి బాలినేని వాసన్న కక్ష తీర్చుకుంటున్నారనే చర్చ అయితే ప్రకాశం జిల్లాలో జోరుగా నడుస్తోంది.

Related Posts