YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజాకు హోంశాఖ..?

రోజాకు హోంశాఖ..?

తిరుపతి, మార్చి 21,
ఎలాగైనా త‌న‌కు మంత్రి ప‌ద‌వి రావాల్సిందే. అందులోనూ ఏదో చిన్నాచిత‌కా శాఖ కాదు.. చేస్తేగీస్తే త‌న‌ను హోంమంత్రిని చేయాల్సిందే. ఇదీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా జ‌బ‌ర్ద‌స్త్ ప్లాన్‌. అయితే, జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్ లాంటి.. పెద్దిరెడ్డి త‌న మినిస్ట‌ర్ పోస్ట్‌కు అడ్డుప‌డుతుండ‌టంతో.. అధినేత‌కు లెఫ్ట్‌హ్యాండ్ లాంటి విజ‌య‌సాయిరెడ్డితో క‌థ న‌డుపుకొస్తున్నారు రోజా. ఇటీవ‌ల నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ విజయసాయిరెడ్డితో తాడేపల్లిలో భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం కోసం వీరిద్దరు సమావేశమయ్యారని చర్చ అయితే నడుస్తోంది. కేబినెట్‌లో బెర్త్ కన్‌ఫార్మ్ చేసుకునేందుకే విజయసాయిరెడ్డితో రోజా మంతనాలు జరిపిందనే చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. కొత్తగా కొలువు తీరుతోన్న ఈ కేబినెట్ రానున్న ఎన్నికల వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలో రోజాకు కీలక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ అల్ హోం శాఖను ఆమెకు కట్టబెట్టే ఛాన్స్ లేకపోలేదని టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటి వరకు హోం మంత్రిగా ఉన్న ఎం. సుచరిత స్థానాన్ని రోజా అందుకొనుందని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుది, రోజాది ఒకే జిల్లా. ఈ నేపథ్యంలో రోజాకు హోం శాఖను కట్టబెడితే.. రానున్న ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక.. ఆర్కే రోజా ప్రధాన ప్రత్యర్థి, అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కూడా ఈ విషయంలో సీఎం జగన్ ఒప్పించారనే టాక్ కూడా అమరావతి సాక్షిగా నడుస్తోంది.  మరోవైపు జగన్ కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజులు సెఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారంతా మాజీ మంత్రులుగా మారి.. జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్‌చార్జులుగా కొత్త అవతారం ఎత్తుతారని సమాచారం. కేబినెట్‌లోకి కొత్తగా రెడ్డి సామాజిక వర్గం నుంచి అయిదుగురిని తీసుకోవాలని సీఎం జగన్ భావించారట. వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికలే కాదు.. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం ఆయన చాలా కష్ట పడ్డారని సీఎం జగన్ అందిన నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అదే జిల్లాకు చెందిన అనంత వెంకట్రామిరెడ్డికి కూడా మినిస్టర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. కర్నూలు జిల్లా నుంచి శిల్ప చక్రపాణిరెడ్డి, సాయి ప్రసాద్‌లు.. చిత్తూరు జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి కూడా స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. కడప జిల్లా నుంచి చీప్ వీప్ జి శ్రీకాంత్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ అనుకున్నారట. ఇక మైనారిటీ విషయానికి వస్తే.. కడప జిల్లాకు చెందిన అంజాద్ బాష ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాకు ఆ ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. పార్టీలో ఆయన సూపర్ సినియర్‌గా ఉన్నారని.. అందుకే జగన్ ఆయనవైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. మరోవైపు ఈ పదవి కోసం కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాష, పార్టీ ఎమ్మెల్సీ, ఐపీఎస్ మాజీ అధికారి ఇక్బాల్‌లు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ కేబినెట్‌లో కొడాలి నానికి కదపకూడదని జగన్ అనుకుంటున్నారట. చంద్రబాబు ఆయన పార్టీ మీద మూడో కాలు మీద లెగిసే... కొడాలి నానిని మాత్రం మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సీఎం ఇష్టపడడం లేదని సమాచారం. ఇక మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లను తప్పించి వారి స్థానంలో ఆయా సామాజిక వర్గాల వారితో భర్తీ చేసే తలంపులో జగన్ ఉన్నారట. అలాగే ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్యకు కూడా మంత్రి పదవి కట్టబెడతారనే ఊహగానాలు కడప జిల్లాలో జోరుగా నడుస్తున్నాయి. బీసీ కులాలకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను తొలగించి ఆ స్థానంలో విడదల రజనీ, పార్థసారథిలకు పదవులు కట్టబెడతారని తెలుస్తోంది. ఇక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పల రాజును కొనసాగించనున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి నారాయణస్వామి,పి. విశ్వరూప్, ఎం సుచరిత, ఏ సురేష్‌లను తొలగించి.. వారి స్థానంలో తలారి వెంకట్రావ్, కొండేటి చిట్టిబాబు, గొల్లబాబురావులకు ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే ఆర్థర్, సుధాకర్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, కలివేటి సంజీవయ్యలు మంత్రిపదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఎస్టీల నుంచి పుష్ప శ్రీవాణిని తొలగించి ఆ స్థానంలో వి.కళావతిని కూర్చొబెట్టాలని జగన్ అనుకుంటున్నారట. ఇక బ్రాహ్మణ వర్గానికి  వచ్చే సరికి మల్లాది విష్ణు లేదా కొన రఘుపతిలలో ఒకరికి ఛాన్స్ దక్కతోందట. మరి వీరిలో ఎవరికీ లక్కీ ఛాన్స్ అనేది త్వ‌ర‌లోనే తెలిసిపోనుంది.

Related Posts