YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రశాంత్ కిషోర్ కు కేసీఆర్ బ్రేకప్..

ప్రశాంత్ కిషోర్ కు కేసీఆర్ బ్రేకప్..

హైదరాబాద్, మార్చి 21,
ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్’తో మంతానాలు జరిపారు. అంతకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్’తో చర్చలు సంప్రదింపులు సాగించారు. సలాహాలు ఇస్తూనే ఉన్నారు,  సూచనలు చేస్తూనే ఉన్నారు.  ఫైనల్’గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీని’ను మళ్ళీ గెలిపించే బాధ్యతను పీకే తీసుకున్నారు. డీల్ సెటిల్ అయింది. కొంత మంది  ఇన్నికోట్లు అంటే, కొందరేమో అన్ని కోట్లు అంటున్నారు. రేటు ఎంతైనా డీల్ అయితే కుదిరింది.పీకే, నటుడు కేసీఆర్ అనధికార వ్యూహకర్త  ప్రకాష్’ రాజ్ తోకలిసి మల్లన్నసాగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులు వెంట వుండి, మర్యాదలు చేశారు. సో.. ఎలాంటి అనుమానం లేకుండా పీకే’తో కేసీఆర్ డీల్ ఫైనలైజ్’ అయిందని అందరికీ అర్థమైంది. అధికార తెరాస నాయకులు టీవీ చర్చల్లో ఇతరత్రా కూడా, డీల్ కుదిరిందని, పీకే బృందం రంగంలోకి దిగిందని, దిగుతుందని చెప్పు కొచ్చారు. అలాగే, పీకే స్క్రిప్ట్’లో భాగంగానే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం స్క్రిప్ చేయడం, ముఖ్యమంత్రి అసుపత్రి సీన్’వంటి కొన్ని సంకేతాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్న ప్రచారం జరిగింది. అయితే, ఇదంతా అయిన తర్వాత. రెండు మూడు రోజుల క్రితం, పీకే ఒక నేషనల్ న్యూస్ ఛానల్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో పీకే, తెరాసతో తాను ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పుకొచ్చారు. తెరాసతో డీల్ లేకుండానే, పీకే బృందం తెలంగాణలో పనిచేస్తోందా, అంటే పీకే ఐపాక్’ బృందంతో  తనకు  సంబంధం లేదని అన్నారు. అయితే, ఐప్యాక్’కు పీకేకి సంబంధం లేదంటే, నమ్మే పరిస్థితి లేదని వేరే చెప్పనక్కరలేదు. అయితే, పీకే ముందు డీల్ కుదుర్చుకున్నా, సర్వే రిపోర్ట్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ‘మిడిల్ డ్రాప్’ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే ఆయన నేషనల్ ఛానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ’లో కేసీఆర్’తో తెరాసతో డీల్ లేదని ప్రకటించారని క్లోజ్ సర్కిల్స్ ‘సమాచారం. సహజంగా, పీకే ట్రాక్ రికార్డు చూస్తే, ఆయన గెలిచే పక్షంతో డీల్ చేసుకుని, గెలుపు క్రెడిట్’ను సొంతం చేసుకోవడమే కాని, ఓడిపోయే పార్టీని గెలిపించిన దాఖాలాలు లేవని, పరిశీలకులు అంటారు. అందుకే ఆయన యూపీలో కాంగ్రెస్ డీల్ తిరస్కరించారని, అదే విధంగా గోవాలో తృణమూల్’తో ఒప్పందం రద్దు చేసుకున్నారని, అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో తెరాస ఓటమి పక్కా అనే నిర్ణయానికి వచ్చే, డీల్ లేదని అంటున్నారని, అంటున్నారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని భావించి తెరాసతో తెగ తెంపులు చేసుకున్నారని అంటున్నారు. అయితే, పీకేని నమ్మేందుకు లేదని, ఆయనకు నీతి, నిజాయితీ, నిజమే చెప్పాలనే నియమాలు ఏవీ ఉండవని, కాబట్టి ఆయన ఏదీ చెప్పిన నమ్మలేమనే మాట కూడా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే, పీకే వ్యవహారం ఎలా ఉన్నా, ఎన్నికలు ఇప్పుడు వచ్చినా, ఇంకెప్పుడు వచ్చిన, తెరాస ఓటమి ఖాయమని, అన్ని సర్వేలు సూచిస్తున్నాయి.  చివరకు కేసీఆర్ చేయించుకున్న  సొంత సర్వేలలో కూడా,, ఎండ్ రిజల్ట్, ‘ప్యాకప్’ అనే వస్తోందనేది మాత్రం నిజం, అంటున్నారు.

Related Posts