YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అభ్యర్థులను సిద్ధం చేస్తున్న కమల దళం

అభ్యర్థులను సిద్ధం చేస్తున్న కమల దళం

హైదరాబాద్, మార్చి 21,
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అధికార తెరాస  తొందర పడుతోందా? ప్రతి పక్షాలు తొందరపడుతున్నాయా, అంటే,ఇంతవరకు అధికార పార్టీనే ‘ముంద’డుగు వేస్తోందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో వినవచ్చింది. కానీ, తాజా సమాచారం ప్రకారం తెరాస కంటే, బీజేపీ ముందస్తుకు మరింత తొందర పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ నాయకత్వం జరిపించిన సర్వేలో ముందస్తు ఎన్నికలు జరిగితే, తెరాస తట్టాబుట్టా సర్దుకోక తప్పదని స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు సమాచారం. ఈ సర్వే అదారంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం, అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుకు తెచ్చేదుకు వ్యూహాత్మకంగా పావులు కడుపుతోందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని దిక్కుల నుంచి అష్ట దిగ్భందనం చేసేందుకు, ఓ వంక ఐటీ, ఈడీ, సీబీఐని బరిలో దించడంతో పాటుగా, నేరుగా జాతీయ నాయకులే రంగంలోకిదిగి, ఇతర పార్టీలలో కీలక నేతలకు కాషాయ కండువాలు కప్పేందుకు సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపధ్యంలోనే, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంతో సంబంధం లేకుండా,రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే  సిద్ధమవుతోంది. అందులో భాగగా కనీసం సగం స్థానాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని భావిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే 50–60 సీట్లకు అభ్యర్థులతో తొలి జాబితా విడుదలకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2018 డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ ఒకేసారి 105 మందితో జాబితా ప్రకటించి సంచలనం సృష్టించగా బీజేపీ మాత్రం అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. ఆ ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. కేవలం ఒకే ఒక్క స్థానం నుంచి మాత్రమే బీజేపీ గెలిచింది. సుమారు వందకు పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్ధులు డిపాజిట్’ కోల్పోయారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు, బీజేపీ, ఈసారి ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో ఇప్పటికే ఇంచుమించుగా 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులుగా ఖరారైనట్లు సమాచారం. కాగా,  వారికి పని మొదలుపెట్టాలని కూడా నాయకత్వం సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. మరోవంక పార్టీ ఎన్నికల సంసిద్ధతను వేగవంతం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నేతలు త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వచ్చే నెల 14 నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టే రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ఈ నెలలోనే జనగామ లేదా మరో ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. 24 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. 21న జనగామలో, 22న వికారాబాద్‌ తదితర చోట్ల జిల్లాస్థాయి నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై సమాలోచనలు జరపనున్నారు. పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీ, సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ రాష్ట్ర పార్టీ సంస్థాగత పటిష్టతపై పర్యవేక్షించనున్నారు. సంతోష్‌జీ, శివప్రకాష్‌జీ త్వరలోనే తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నట్లు సమాచారం. త్వరలో నిర్వహించే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల జోనల్‌ సమావేశంలో శివప్రకాష్‌జీ పాల్గొని పార్టీ బలోపేతంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచరం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పాటుగా, రాష్ట్రంలోనూ సానుకూల వాతావరణం డెవలప్’ అవుతున్న నేపధ్యంలో, ఈ ఉత్సాహాన్ని ఇలాగే ముందుకు తీసుకు పోగలిగితే తెరాసను చిత్తూ చేయడంతో పాటుగా, ప్రాధాన ప్రత్యర్ధిగా నిలిచైన కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చనే, అలోచనతో  బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’ ఓటమి తధ్యమని తెలిస్తే, అసెంబ్లీ రద్దు చేయక పోవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ముందస్తుకు వెళ్తామని చెప్పలేదు, సరికదా, అసలు అలాంటి ఆలోచనే లేదని అయితే ఒకటికి రెండు సార్లు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి మాటలకు అర్థాలు వేరని, అవునంటే కాదని, కాదంటే అవునని, అని విపక్షాలు, అదే విధంగా మీడియా వ్యూహాగానాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి అయితే ముందస్తు కీ’ అయితే కేసీఆర్ చేతిలోనే వుంది, అందులో అనుమానం లేదు.

Related Posts