YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

రిమ్స్ లో పండ్లు పంపిణీ చేసిన రామ్ చరణ్ అభిమానులు

రిమ్స్ లో పండ్లు పంపిణీ చేసిన రామ్ చరణ్ అభిమానులు

శ్రీకాకుళం
మేగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా  టీంరామ్ చరణ్ శ్రీకాకుళం జిల్లా యువత ఆద్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా సోమవారం రిమ్స్ ఆసుపత్రిలో రోగులకి అభిమానులు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో  అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రామ్ చరణ్ అభిమానులతో కలిసి రిమ్స్ ఆసుపత్రిలోని వివిద వార్డులలో చికిత్స పొందుతున్న రోగులకి పండ్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఇచ్చిన పిలుపు మేరకు టీం రామ్ చరణ్ యువత శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మజ్జి గౌతమ్ ఆద్వర్యంలో ప్రతి ఏడాది వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే సోమవారం రోగులకి పండ్లను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారన్నారు.  ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు జరగనుండా వారం రోజుల ముందు నుంచే వేడుకలను అభిమానులు ప్రారంభించారన్నారు. రామ్ చరణ్ అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ఈ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటున్నారన్నారు.  ఈ పండ్ల పంపిణీ   కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి  వైశ్యరాజు మోహన్ ,టీమ్ రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షుడు తైక్వాండో గౌతమ్, లింగాల హరీష్, షేక్ మదినా, నాని చరనిజం ,సిద్దు  , చరణ్ తేజ , శివ చెర్రీ ,సతీష్ ,మొనింగి రాజేంద్ర , కమల్, కళ్యాణ్, జిల్లా పవన్ కళ్యాణ్ అధ్యక్షులు కిరణ్ కిర్రు , పెయ్యల చంటి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు పుక్కల నవీన్ ,గిరి, నాని, జనార్ధన  ,సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ ,  జిల్లా వరుణ్ తేజ అభిమాన సంఘ అధ్యక్షుడు శీర రాజు, పంకు మురళి తదితరులు పాల్గొన్నారు.

Related Posts