YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2024 అంత ఈజీ కాదా...

2024 అంత ఈజీ కాదా...

గుంటూరు, మార్చి 22,
2019 ఎన్నికలకు ఈసారి జరగబోయే ఎన్నికలకు పొలిటికల్ సీన్ పూర్తిగా మారుతుంది. ప్రధానంగా జగన్ పార్టీ విషయంలో రివర్స్ అవుతుంది. గత ఎన్నికల్లో శత్రువులు ఉన్నా వారు విడివిడిగా పోటీ చేయడం జగన్ కు అడ్వాంటేజీగా మారింది. కానీ ఈసారి శత్రువులంతా ఏకమై జగన్ ను టార్గెట్ చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇంటా, బయటా ఈసారి శత్రువులు జగన్ కు మరింత ఎక్కువ కానున్నారు. కుటుంబంలోనే.... జగన్ కు సొంత కుటుంబంలోనే వ్యతిరేకత ఉంది. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారు. జగన్ కూడా వారి సాయాన్ని కోరే ఆలోచనలో లేరు. వైఎస్ కు సన్నిహితులైన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు కూడా ఈసారి జగన్ కు సాయం చేయకపోగా అవసరమైతే నాలుగు రాళ్లు వేయడానికి సిద్దమవుతారన్నది వాస్తవం. రాజకీయంగా ఎంతమంది శత్రువులను అయినా ఎదుర్కొనవచ్చు. కానీ కుటుంబంలో తలెత్తిన విభేదాలు జగన్ పాలన మీద కాకుండా వ్యవహారశైలికి మచ్చ తెచ్చే విధంగా ఎన్నికల సమయానికి మారతాయి.గత ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా సాయం చేశారన్న టాక్ అయితే ఉంది. అయితే ఈసారి జగన్ కు కేసీఆర్ మద్దతు దొరికే అవకాశం లేదు. గత ఎన్నిలకు ఈసారి ఎన్నికలకు జగన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారబోతుంది. గత ఎన్నికల్లో జగన్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. ఒంటరి వాడిని చేసి కేసులు పెట్టారన్న బాధ ప్రజల్లో ఉంది. పాదయాత్ర కూడా అందుకు తోడయింది. దీంతో వ్యక్తిగత ఇమేజ్ తోనే జగన్ 151 స్థానాలను పార్టీకి సాధించిపెట్టగలిగారు. ఈసారి ప్రజలకు దూరంగా ఉంటున్నారు.. కానీ ఈసారి వాటిలో ఏదీ పనిచేయని పరిస్థితి. ఐదేళ్లు అధికారంలో ఉండటంతో పాత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఈసారి సామాజికవర్గాల సమీకరణాలు కూడా పెద్దగా పనిచేయక పోవచ్చు. గంపగుత్తగా ఒకే సామాజికవర్గం నేరుగా జగన్ కు ఓటేసే అవకాశాలు కన్పించడం లేదు. ఆయన సొంత సామాజికవర్గంలోనూ అసంతృప్తి కనిపిస్తుంది. మొత్తం మీద జగన్ కు ఈసారి ఎన్నికలకు అంత సులువు కాదు. జగన్ కు శత్రువుల సంఖ్య పెరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Related Posts