YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డైవర్షన్ పాలిటిక్స్ లో పార్టీలు

డైవర్షన్ పాలిటిక్స్ లో పార్టీలు

విజయవాడ, మార్చి 22,
ఆంధ్రప్రదేశ్’లో దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందా? అధికార పార్టీ, ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లుగా, శాసనసభ కార్యకలాపాలు సాగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అధికార వైసీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరు ప్రజస్వామ్య విలువలను పాతరేసే విధంగా ఉందని, ఎవరో కాదు, ఆ పార్టీ నాయకులే, సభ బయట వ్యక్తిగత సంభాషణల్లో ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. గత వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  సభలో కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, అంతకు మించి సభ జరుగుతున్న తీరుకు వేరే తిప్పని అవసరం లేదు. నిజానికి, చంద్రాబాబు నాయుడు సభలో తమకు జరిగిన అవమానానికి కలత చెంది, కన్నీరు పెట్టుకున్న తర్వాత అయినా అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనలో లేదా ప్రభుత్వం సభను నిర్వహిస్తున్న తీరులో గానీ, ఏమైనా మార్పు వచ్చిందా, అంటే అదీ లేదు. సభలో ప్రతిపక్షమే ఉండకూడదు, అనే విధంగా, వరసగా గత ఐదు రోజులుగా, ప్రతిపక్ష తెల్సుసు దేశం సభ్యులను, ఏ రోజుకు ఆ రోజు సభ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతోంది. రాష్టంలో కల్తీ సార తగి 18 మంది చనిపోతే, దాని పై సభలో  చర్చజరగ కుండా చేయడమే కాకుండా, అవన్నీ  సహజ మరణాలని బుకాయించే ప్రయత్నం చేయడం, ప్రజస్వామ్యాన్ని పరిహరించడమే అవుతుందని, అంటున్నారు. నిజానికి కల్తీ సారా, మద్యం కారణంగా రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తెలుదు దేశం, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు, నాటుసారా మరణాలపై నుంచి దృష్టి మళ్లించేందుకే, అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదలా ఉంటే, వరుసగా ఐదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని తెదేపా నేతలు మండిపడ్డారు. నాటుసారా మరణాలపై నుంచి దృష్టి మళ్లించేందుకే.. ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని విమర్శించారు. నాటుసారా మరణాల పై నుంచి దృష్టి మళ్లించేందుకే.. ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. వరుసగా అయిదో రోజూ.. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పార్లమెంటులో పెగాసస్‌పై చర్చ వద్దన్న వైకాపా.. అసెంబ్లీలో మాత్రం చర్చకు పట్టుపడుతోందని ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కనుక..పెగాసస్‌పై దర్యాపు చేసి నిజానిజాలు తేల్చి ప్రజల ముందుంచాలని సవాల్ చేశారు. చంద్రబాబు మీద బురద జల్లడానికే.. మమత బెనర్జీతో ఫేక్ మాటలు చెప్పించారని ఆరోపించారు. మద్యం, సారా కారణంగా రాష్ట్రంలో వెయ్యిమందికి పైగా చనిపోయారని నేతలు ఆరోపించారు. తాడేపల్లికి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే.. పెగాసెస్ పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి బ్రాండ్స్ ఏపీలో ఉన్నాయి. మందు కాదు అది విషని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆరోపించారు. రాష్టంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పెగాసస్ అంశాన్ని శాసనసభలోకి తీసుకురావడం అత్యంత హేయమైన చర్య. దీనిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. నిజం. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మద్యం పాలసీలో వచ్చిన మార్పులు, ప్రవేశ పెట్టిన దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్స్’ వలన సామాన్య ప్రజలు అనేఅక మంది అనారోగ్యం పాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు.

Related Posts