YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నల్లారి బ్రదర్స్ మధ్య పొలిటికల్‌ వార్‌.

నల్లారి బ్రదర్స్ మధ్య  పొలిటికల్‌ వార్‌.

తిరుపతి, మార్చి 22,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఆయనకో ప్రత్యేకత ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఆయనదే కీ రోల్‌. అలాంటి నాయకుడు.. ఐదేళ్లుగా సొంతింటి గడప తొక్కట్లేదట? ఆ స్థాయి నాయకుడు ఇప్పుడెందుకిలా? కారణం ఏమయ్యుంటుంది? ఏపీ పొలిటికల్‌ కారిడార్‌లో ఇప్పుడు ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు నల్లారి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిత్తూరు పాలిటిక్స్‌లో చక్రం తిప్పిన నల్లారి ఫ్యామిలీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలక పదవుల్ని దక్కించుకుంది. నల్లారి అమర్నాథ్‌ రెడ్డి మంత్రిగా ఒక శకం నడిపిస్తే.. ఆయన కుమారుల్లో ఒకరైన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అంతేకాదు, ఉమ్మడి ఏపీకి ఆఖరి ముఖ్యమంత్రిగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక నేతగా… పాలిటిక్స్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు కిరణ్‌కుమార్‌ రెడ్డి.పొలిటికల్‌గా ఓ రేంజ్‌లో చక్రం తిప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి… ఇప్పుడు సొంత జిల్లాలో, అదీ.. సొంతూళ్లో సొంతింటికి వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. దానికి కారణం, తన తమ్ముడు నల్లారి కిశోరేనన్నది పొలిటికల్‌ టాక్‌. అన్న సీఎంగా ఉన్నప్పుడు జిల్లాలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన కిషోర్‌ ఇప్పుడు.. టీడీపీలో ఉన్నారు. 2019లో ఆ పార్టీ తరపునే పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే, కిరణ్‌ మాత్రం రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేకుండా ఉండిపోయారు. కీలక అనుచరులతో టచ్‌లో ఉంటున్నా పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండటం లేదు. అయితే, జిల్లాకు రాకపోకలు సాగిస్తున్నా.. కలికిరి మండలంలోని సొంతూరు నగరిపల్లికి వెళ్లలేని పరిస్థితి ఆయనది. ఎందుకంటే, టీడీపీ కీలక నేతగా.. తన తమ్ముడు నల్లారి కిశోర్‌, ఆ ఇంటి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నారట. దీంతో, కాంగ్రెస్‌ కండువా వేసుకుని.. పసుపు జెండా పట్టుకున్న తమ్ముడి ఇంటికి వెళ్లడానికి కిరణ్‌ ఇష్టపడం లేదట. దీంతో, కలికిరి వచ్చినా.. అప్పట్లో సీఎంగా తాను కట్టించిన ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌజ్‌లోనే బసచేసి నేతలతో మాట్లాడి వెళ్లిపోతున్నారంట కిరణ్‌. తమ్ముడి తీరు వల్లే కిరణ్‌ ఐదేళ్లుగా సొంతూరి ముఖం చూడలేకపోతున్నారని పొలిటికల్‌ కారిడార్‌లో చర్చ జరుగుతోంది. గెస్ట్‌ హౌజ్‌కు కిలోమీటర్‌ దూరంలోనే ఉన్నా.. సొంతింటివైపు కిరణ్‌ కన్నెత్తి చూడటం లేదంటున్నారు స్థానికులు.నల్లారి సోదరుల మధ్య రాజకీయ విభేదాలతో.. నియోజకవర్గ కేడర్‌ కూడా రెండుగా చీలిపోయిందట. కిషోర్ టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ.. కిరణ్‌ ముఖ్య అనుచరుల్లో చాలామంది ఆయన డైరెక్షన్‌లోనే నడుస్తున్నారట. అన్నదమ్ముల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కుటుంబంలోనూ, బంధువుల్లోనూ చీలిక వచ్చిందట. సీఎంగా ఓ వెలుగువెలిగిన కిరణ్‌.. తమ్ముడు చేసిన నిర్వాకానికి సొంతూరికి దూరమయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారట. నల్లారి బ్రదర్స్ మధ్య ముదిరిన పొలిటికల్‌ వార్‌.. ఏ మలుపు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

Related Posts