ముంబై, మార్చి 22,
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ బుడి బుడి అడుగులతో బడి బాట పట్టాడు. ముంబైలోని ప్లే స్కూల్‌లో అడుగుపెట్టాడు. ముఖేష్ అంబానీ మనవడు మొదటిసారి బయటకు రావడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. 15 నెలల వయసున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు – శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకు వచ్చారు. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు కూడా అదే పాఠశాలలో చదువుకున్నారు. పృథ్వీ తల్లిదండ్రులు తమ కుమారునికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కోరుకున్నారు. అయితే అదే సమయంలో నాణ్యమైన విద్యను అందించే పాఠశాలను ఎన్నుకునేందుకు చాలా ఎంక్వైరీ చేశారు.అయితే చివరికి శ్లోక, ఆకాష్ చదువుకున్న స్కూల్లోనే జాయిన్ చేశారు. ప్రత్యేక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పృథ్వీ స్కూలుకు తీసుకొచ్చారు. వచ్చిన మొదటి రోజే తోటి పిల్లలతో కలిసి పోయి ఆడుకున్నాడని పాఠశాల వర్గాలు తెలిపాయి. పృథ్వీ సాధారణ జీవితాన్ని గడపాలని ముఖేష్ కుటుంబం కోరుకుంటుండటం విశేషంపృథ్వీ పేపర్ పొద్దుతిరుగుడు పువ్వు పట్టుకుని కనిపించాడు.తన తల్లిదండ్రులు చదువుకున్న పాఠశాలలోనే పృథ్వీ అంబానీ జాయిన్ చేయించారు. ఆకాష్- శ్లోక మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌లో చదువుకున్న సంగతి తెలిసిందే. అయితే పృథ్వీకి సురక్షితమైన, సురక్షితమైన కానీ నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సాధారణ జీవితాన్ని అలవాటు చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం విశేషం.అయితే తొలి రోజు అందిరితో కలిసిపోయిన పృథ్వీ అంబానీ.. తిరిగి ఇంటి వెల్తున్న సమయంలో తన వెంట పేపర్‌తో తయారు చేసిన పొద్దుతిరుగుడు పువ్వును చేతిలో పట్టుకుని కనిపించాడు. చిన్నోడిని తల్లి శ్లోక ఎత్తుకుని తీసుకెళ్లడం మీడియాలో కనిపించింది.పృథ్వీ అంబానీ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని సన్నాహాలు చేశారు. పృథ్వీ అంబానీ క్షేమంగా ఉండేందుకు ఆయన వెంట ఎప్పుడూ ఒక డాక్టర్ ఉంటారు. అంబానీ మొదటి మనవడి భద్రత చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారు సాధారణ దుస్తులలో ఉంటారు. అటుగా వచ్చేవారిపై నిఘా పెట్టి ఉంటారు.