YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో నిధుల దుర్వినియోగం నిందితుడు అరెస్ట్

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో నిధుల దుర్వినియోగం నిందితుడు అరెస్ట్

ఆదిలాబాద్
తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో కోటి 25 లక్షల  దుర్వినియోగం పై పోలీసుల విచారణ వేగవంతం చేసారు.  సూత్రధారి ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడకు చెందిన కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్(సీఎస్పీ) జెటాల రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 20 వేల రూపాయల  నగదు, 4 లక్షల విలువైన కెమెరాలతోపాటు రూ.80,900 విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న ఆదిలాబాద్లోని గ్రామీణ బ్యాంకు ప్రధాన బ్రాంచి మేనేజర్ మహీ వివేక్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐరిక్స్ ప్రైవేటు సంస్థ ద్వారా నియమితులైన జెటాల రమేష్ గత సంవత్సరం సెప్టెంబరు 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17 వరకు ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ డబ్బులను ఆదిలాబాద్ లోని కొంతమంది మిత్రులు, పరిచయస్థులకు డబ్బులు ఇచ్చినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ వివరించారు. సమగ్ర విచారణలో భాగంగా ఈ కేసును సీఐడీకి నివేదిస్తామని తెలిపారు. నిందితుడిని కోర్టుకు రిమాండ్ తరలించినట్లు వివరించారు

Related Posts