హైదరాబాద్, మార్చి 22,
మళ్లీ తూచ్. కేసీఆర్ ఢిల్లీ వెళ్లట్లేదు. మంత్రులు, ఎంపీలు మాత్రమే హస్తిన పయనమవుతున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారంటూ మూడు రోజుల ముందేగానే వార్తలు వచ్చాయి. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. శనివారం ఫాంహౌజ్‌లో మంత్రులతో మీటింగ్ పెట్టి.. ఢిల్లీపై ఎలా దండెత్తాలో కసరత్తు చేశారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్.. అది ముగిశాక నేరుగా ప్రత్యేక విమానంలో మంత్రులతో కలిసి కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం. ఇదీ షెడ్యూల్. కానీ... అలా జరగలేదు. కేసీఆర్ హస్తిన వెళ్లట్లేదు. కేవలం తన మంత్రుల బృందాన్ని మాత్రమే హస్తిన పంపిస్తున్నారు. మోదీని కలిసేది లేదు.. ఢిల్లీలో ధర్నాలు, పోరాటాలు ఇప్పట్లో లేవు. మరెందుకు అలా లీకులు ఇచ్చారు? ఎందుకంత బిల్డప్ ఇచ్చారు? అనేది ఆసక్తికరం. ఇదంతా ప్రశాంత్ కిశోర్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఇలా లీకులు ఇవ్వడం పీకే స్టైల్ పాలిటిక్స్. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పడం..చేయటం ప్రశాంత్ కిశోర్ ఇస్టైల్. అవును, ఢిల్లీపై కేసీఆర్ దండయాత్ర అంటూ ఇలా బిల్డప్ ఇచ్చిందంతా పీకే డైరెక్షన్‌లోనే అంటున్నారు. శనివారం నాటి ఫాం హౌజ్ మంత్రుల మీటింగ్ కంటే ముందే.. ప్రశాంత్ కిశోర్ అక్కడికి వచ్చి వెళ్లారని.. పీకేతో చర్చ తర్వాతే.. కేసీఆర్ మినిస్టర్లను పిలిపించి మాట్లాడారని.. ఆ తర్వాత ఢిల్లీ-మోదీ-కేంద్రం-కేసీఆర్ ఫైట్ ఇలా వరుసగా వార్తలు వచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లడం, పోరాడటం.. అంత సీన్ లేనే లేదు. అయినా, కేసీఆర్ హస్తిన వెళ్తారంటూ రాంగ్ ఇన్ఫర్మేషన్ కావాలనే ఇచ్చారు. రైతులు-వరి కొనుగోలు సెంటిమెంట్ రాజేసి.. విషయానికి మరింత హైప్ తీసుకొచ్చేందుకే అలా చేశారని అంటున్నారు. మోదీ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేయకుండానే.. మోదీని కలుస్తారంటూ ప్రచారం చేశారు. ఇక, ఢిల్లీ వెళ్లాల్సిన టైమ్ రాగానే.. తూచ్ అంటూ సైడ్ అయిపోయారు. కేవలం మంత్రులు, ఎంపీలను మాత్రమే హస్తిన పంపిస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ. కేసీఆర్ పీకే ఆడించినట్టు ఆడుతున్న ముఖ్యమంత్రి...అంటున్నారు
నవరసాలు ఒలకబోసిన కేసీఆర్
కేసీఆర్ స్పీచ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక ప్రెస్‌మీట్ అంటే పండగే. నవరసాలు ఒలకబోస్తారు. మాటలతో రక్తి కట్టిస్తారు. పంచ్‌లతో పటాకా పేలుస్తారు. లేటెస్ట్ మీడియా సమావేశంలోనూ అలానే జరిగింది. మోదీ-బీజేపీ-వరి లాంటి రొటీన్ స్పీచ్ తర్వాత ఇక Q & A సెషన్‌లో అసలైన అంశాలు బయటకు వచ్చాయి. ఇటీవల బీజేపీ నేతల నుంచి పదే పదే వినిపిస్తున్న మాట కేసీఆర్ అరెస్ట్.. త్వరలో జైలుకు. సోషల్ మీడియాలోనైతే కావాల్సినన్ని స్టోరీలు. అదిగదిగో ఐటీ రైడ్స్.. ఇక నెక్ట్స్ ఈడీ అటాక్స్ అంటూ వార్తలు. ఇవన్నీ కేసీఆర్‌ను కాస్త కల్లోల పరుస్తున్నట్టే ఉన్నాయి. ఆయా న్యూస్‌లపై సీఎంవో వర్గాలు సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈడీ రైడ్స్ గురించి నేరుగా కేసీఆర్‌నే ప్రశ్నించారు జర్నలిస్టులు. తెలుసుగా కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో? లోపల ఎంత ఆందోళన ఉన్నా.. బయటకు మాత్రం గాంభీర్యం ప్రదర్శించడంలో ఎక్స్‌పర్ట్. అందుకే, ఈడీ లేదు, బోడీ లేదు. అవన్నీ దిక్కుమాలిన ప్రచారాలు. దమ్ముంటే రమ్మనండి. తనను టచ్ చేయమనండి. ఊరుకుంటామా? అంటూ తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఈడీ రైడ్స్ అంటే భయం లేనట్టే కవరింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇక ముందస్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. గత ఎన్నికల పరిస్థితులు వేరు.. ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు. అప్పుడంటే ప్రాజెక్టులు పూర్తి కావాలి కాబట్టి అలా మాస్టర్ ప్లాన్ వేసాం. ఈసారి ముందస్తు అవసరం లేదంటూ తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణలో 30 నియోజక వర్గాల్లో సర్వేలు చేయించామని.. అందులో 29 స్థానాల్లో టీఆర్ఎస్సే గెలుస్తుందని సర్వే రిపోర్టు చెబుతున్నాయని.. ఒక్క చోట మాత్రం 0.3 శాతం ఓట్ల తేడాతో ఓడిపోతామని వచ్చిందని కేసీఆర్ చెప్పారు.
ఇక, కశ్మీర్ ఫైల్స్ పేరుతో బీజేపీ విచ్చిన్నకర రాజకీయాలకు పాల్పడుతోందంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశానికి కావాల్సింది ఇరిగేషన్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్. ఇండస్ట్రీ ఫైల్స్.. లాంటివి కానీ, ఈ పనికిమాలిన కశ్మీర్ ఫైల్స్‌తో ఎవరికి ఉపయోగం అంటూ బీజేపీని నిలదీశారు. ఎప్పటిలానే కేసీఆర్ ప్రెస్‌మీట్ ఆయన మాటల గారడీతో రంజుగా కొనసాగింది. అయితే, కేసీఆర్ ఏం చెప్పినా.. ఆయన మాటలు నమ్మే వారి సంఖ్య మాత్రం అతి తక్కువే...అంటున్నారు.