విశాఖపట్నం
జగన్మోహన్ రెడ్డి పాలనలో రసాయనాలు కలిపిన కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వ తీరును విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న వీటిని తాగిన వారు రసాయనాల వల్ల పలు వ్యాధులకు గురవుతున్నా ప్రభు త్వానికి పట్టడంలేదని చెప్పారు.జగన్ ప్రజల ప్రాణాల కన్నా... ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని,జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా వల్ల 25 మంది చనిపోతే... అసెంబ్లీలో వాటిని సహజ మరణాలు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.మృతుల కుటుంబ సభ్యులు, మీ ఎమ్మెల్యే కూడా చెప్పారు.. అవి కల్తీసారా మరణాలని,చంద్రబాబు హయాంలో మద్యంపై వచ్చే ఆదాయం ఆరు వేల కోట్లు అయితే దానిని జగన్ రెడ్డి 16,500 కోట్లకు పెంచారని రాబోయే పదిహేను సంవత్సరాల్లో వీటి అమ్మ కాలపై 25 వేల కోట్లు అప్పు తెచ్చారని ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం తీరని ఎద్దేవా చేశారు.