YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే సీఎం మళ్లీ వరి నాటకం

కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే సీఎం మళ్లీ వరి నాటకం

హైదరాబాద్ మార్చ్ 22
;కేంద్రం వరి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని.. కొనే బాధ్యతలు మేము తీసుకుంటామని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సీఎం మళ్లీ వరి అంటున్నాడని విమర్శించారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో శ్రీవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.రైతులు వరి వేస్తేనేమో ఉరి.. కేసీఆర్ వేస్తేనేమో కోటీశ్వరుడు అని శ్రీవర్ధన్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ తప్పు చేసి వివాదాలలో పడ్డాడని.. కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణలో మూడిందని, త్వరలోనే రాష్ట్రంలో సంచలన మార్పులు జరగ బోతున్నాయని జోస్యం చెప్పారు.. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పై పాలసీ ఉంటుందని.. ఇండియా గేట్ దగ్గర, బిజెపీ ఆఫీస్ దగ్గర వడ్లు పోయడానికి జేసీబీలు దొరకడం లేదా అని నిలదీశారు. ధాన్యం కోనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారన్నారు.. యూపీఏ లో కంటే ఎన్డీఏ ప్రభుత్వంలో రెట్టింపు ధాన్యం కొంటున్నామని పేర్కొన్నారు. దేశంలో వడ్లు కొనుగోళ్లులో తెలంగాణ రెండో రాష్ట్రంలో ఉందని.. కేంద్రం వడ్లు కొనుగోలుకి 84,120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. వానా కాలంలో 40 లక్షలు మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదిరిందన్నారు. అయితే, అదనంగా 24 లక్షలు మెట్రిక్ టన్నుల కొంటామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ కి, రారైస్ కి రైతులకి ఏమి సంబంధం అని ఇప్పటి వరకు అదనంగా ఇస్తామన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని శ్రీవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గాలికి వదిలేసి ఫాంహౌస్ లో మకాం పెట్టిన కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని తులనాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అదేవిధంగా కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై సీఎం కేసీఆర్ చరిత్ర వక్రీకరించే విధంగా మాట్లాడారని ఆరోపించారు. కాశ్మీర్ పండితులు అసలు ఏమయ్యారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై అక్కసు వెల్లగక్కుతున్న కేసీఆర్ చిత్ర యూనిట్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు.

Related Posts